India's e-commerce showdown heating up

Flipkart to turn into app only from next month

flipkart, mobile app, India, smart phones, smartphone, mobile, mobile app, sify, wipro, infosys, app commerce, chirag alreja, hitplay devices, flipkart, myntra, e-commerce, amazon, sahil dala, myonsto.com, snapdeal, payment gateway, m-commerce,amazon,app commerce,chirag alreja,e-commerce,flipkart,hitplay devices,infosys,m-commerce,mobile,mobile app,myntra,myonsto.com,payment gateway,sahil dala,sify

Flipkart sees, India as moving rapidly from a mobile phone first, to a mobile phone only country, there are others who politely disagree.

ఇక ఫోన్ లపైనే లావాదేవీలకు ఫ్లిప్ కార్ట్ మొగ్గు

Posted: 08/06/2015 09:19 PM IST
Flipkart to turn into app only from next month

ఈ కామర్స్ దిగ్గజం సంస్థ 'ఫ్లిప్‌కార్ట్' వెబ్‌సైట్ వచ్చే నెల తర్వాత కనుమరుగు కానుంది. ఆ స్థానంలో కేవలం సెల్‌ఫోన్ అప్లికేషన్ (యాప్) ద్వారానే తన వ్యాపారాన్ని నిర్వహించనుంది. వచ్చేనెల నుంచే ఈ కొత్త పద్ధతిని అమల్లోకి తీసుకొస్తామని, ఈలోగానే తమ యాప్‌ను విడుదల చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఎక్కువ మంది సందర్శకులున్న సైట్లలో ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. ఈ ఏడాది 76 వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని నిర్వహించాలని ఈ కంపెనీ లక్ష్యంగా పెట్టుకొంది. ఈ నేపథ్యంలో వెబ్‌సైట్‌కు గుడ్‌బై చెప్పి యాప్‌ను ప్రవేశపెట్టడం అన్నది ఒక రకంగా గ్యాంబ్లింగే.  

దేశంలో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు రోజురోజుకు పెరుగుతుండడంతో ఫ్లిప్‌కార్ట్ తాజా నిర్ణయానికి వచ్చింది. దీంతో పాటు అందరూ తప్పనిసరిగా తమ యాప్ డౌన్ లోడ్ చేసుకునేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుని వుండవచ్చునని వార్తులు వినబడుతున్నాయి. దీంతో పాటు యాప్ ద్వారా వచ్చే ఆర్డర్లలో విధేయత పాలు ఎక్కువనే నమ్మకమూ కూడా కావచ్చు. మార్కెట్లో దాదాపు మూడువేల యాప్స్ అందుబాటులో ఉండగా, భారతీయ స్మార్ల్‌ఫోన్ వినియోగదారులు సగటున సరాసరి 15 యాప్స్ వాడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఫ్లిఫ్ కార్ట్ యాప్ తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకుని వినియోగించడం అనేది సవాలుగానే మారునుంది. పైగా కంపెనీ పెట్టుకున్న భారీ లక్ష్యాన్ని కూడా యాఫ్ ల ద్వారానే చేరగలదా..? అన్నది కూడా ప్రశ్నగానే మారునుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : flipkart  mobile app  India  smart phones  

Other Articles