చైనా అఫిల్ సంస్థగా ప్రఖ్యాతి చెందిన జియోమీ ఆంధ్రప్రదేశ్‌లోనూ సెల్‌ఫోన్లను ఉత్పత్తి చేస్తోంది. ఆన్‌లైన్ విక్రయాల్లోనూ పైచేయి సాధించిన జియోమీ సంస్థ ‘మేక్ ఇన్ ఆంధ్రా’ అంటూ ఏపీలో తన ఉత్సత్తులను ప్రారంభించనుంది. ఆంధ్రాలో ఉత్పత్తి అయిన జియోమీ ఫోన్లను ఈ నెల పదో తేదీన విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించనున్నారు. చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో ఈ కంపెనీ తన సెల్‌ఫోన్లను తయారు చేయిస్తోంది. తైవాన్‌కు చెందిన ప్రసిద్ధ సెల్‌ఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ శ్రీసిటీ సెజ్‌లో ఫోన్ల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది.
ఫాక్స్‌కాన్ కంపెనీ కర్మాగారంలోనే జియోమీ కంపెనీ తన ఫోన్లను తయారు చేయించుకొంటోంది. ప్రస్తుతం ఇక్కడ నెలకు 50 వేల ఫోన్లను తయారు చేస్తున్నారు. వచ్చే మార్చి నాటికి 50 లక్షల ఫోన్లను తయారు చేసే స్థాయికి కర్మాగారాన్ని విస్తరించాలని ఫాక్స్‌కాన్ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సెల్‌ఫోన్లు తయారు చేసే మొట్టమొదటి కర్మాగారం ఇదే కావడం విశేషం. ఇప్పటి వరకు ఏపీలో హార్డ్‌వేర్ తయారీ పరిశ్రమ లేదు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫాక్స్‌కాన్ వచ్చి తన ప్లాంటును పెట్టింది. ఇది ప్రతిష్ఠాత్మక ఉత్పత్తి కావడంతో ఈ ఫోన్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని విశాఖలో పెట్టారు. కాగా అటు తెలంగాణాలోనూ సెల్ కాన్ మొబైల్ సంస్థ తన ఉత్పత్తులతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more