విదేశాల నుంచి వచ్చిన వ్యతిరేక పవనాలకు తోడు మార్కెట్లలో అమ్మకాల ఒత్తడి నేపథ్యంలో వారాంతంలో స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ముఖ్యంగా అమెరికా ఫెడ్ రిజర్వలు వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న వార్తల నేపథ్యంలో మదుపురులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో దేశీయ సూచీలు క్రమంగా నష్టాల బాటలో పయనించాయి. ఇవాళ ఉదయం ప్రారంభంతోనే స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 62 పాయింట్ల నష్టాన్ని చవిచూడగా, అటు నిష్టీ కూడా 24 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసుకుంది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 28 వేల 236 పాయింట్ల వద్ద ముగియగా, నిప్టీ కూడా 8565 పాయింట్ల వద్ద ముగిసింది.
బ్యాంకింగ్ రంగ సూచీలు అధికంగా నష్టపోవడంతో మార్కెట్లు నష్టాల్లో పయనించడానికి కారణమయ్యాయి. దీంతో పాటు క్యాపిటల్ గూడ్స్, మెటల్స్ సూచీలు కూడా భారీ నష్టాలను చవిచూశాయి. వీటితో పాటు ఎఫ్ఎంజీసీ, హెల్త్ కేర్, ఐటీ, పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, టెక్నాలజీ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించిన సూచీల షేర్లు కూడా స్వల్ప నష్టాలను మూటగట్టుకున్నాయి. అయిల్ అండ్ గ్యాస్, అటో, కన్జూమర్ డ్యూరెబుల్స్ సూచీలు లాభాలను ఆర్జించాయి. ఈ క్రమంలో బిహెచ్ఇఎల్, కోల్ ఇండియా, ఎస్ బి ఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఏషియన్ పెయింట్స్ తదితర సంస్థల షేర్లు నష్టాలను చవిచూడగా, ఓ.ఎన్.జీ.సీ, టాటా మోటార్స్, వేదంతా, బిపిసీఎల్, గ్రాసిమ్ తదితర సంస్థల షేర్లు అధిక లాభాలను గడించాయి.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more