Sensex tanks 382 pts on global weakness; IT, Bank Nifty drag

Global cues spook nifty ends at 7732 sensex falls 382 points

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, Federal Reserve, fiscal consolidation, GDP growth, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

BSE Sensex, reversing its 2-day rally, today fell almost 382 points to close at over a two-month low of 25,482.52.

ఐరోపా దెబ్బకు విలవిల.. రెండు నెలల కనిష్టస్థాయికి మార్కెట్లు..

Posted: 11/18/2015 05:58 PM IST
Global cues spook nifty ends at 7732 sensex falls 382 points

విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల పవనాలతో భారత మార్కెట్లు భారీ నష్టాలను ఎదుర్కోన్నాయి. గత రెండు రోజులుగా నమోదు చేసుకున్న లాభాలు హరించుకుపోగా, నష్టాలలో పయినించిన మార్కెట్లు రెండు నెలల కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఐరోపా మార్కెట్ ప్రభావంతో పాటు అమెరికా సెంట్రల్ బ్యాంకు ఫెడ్ రిజర్వు ద్రవ్య పరపతి సమీక్ష అంశాలు దేశీమ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని కనబర్చాయి. డిసెంబర్ లో జరిగే ఫెడ్ రిజర్వు సమావేశాలు తుది ఫలితాలు వెల్లడయ్యే వరకు మదుపరులు వేచిచూసే దోరణిని అవలంభించడంతో మార్కెట్లు ఒత్తిడికి గురయ్యాయి.

మరోవైపు ఐరోపా మార్కెట్లు ప్రభావం కూడా మన మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకూ క్రితం ముగింపుతో పోలిస్తే స్వల్ప నష్టాల్లో స్థిరంగా సాగిన సూచికలు, యూరప్ మార్కెట్ల ప్రారంభం తరువాత ఒక్కసారిగా ఒత్తిడికి లోనయ్యాయి. ప్రధానంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత మార్కెట్లోని కంపెనీల ఈక్విటీలను విక్రయించి లాభాలను తీసుకుపోయారు. వీరితో పాటు దేశవాళీ సంస్థాగత సంస్థలు సైతం అమ్మకాలకే మొగ్గు చూపడంతో సూచికల నష్టం క్రమంగా పెరిగింది. ఫలితంగా 382 పాయింట్లను కొల్పోయిన సెన్సెక్స్ 25,482.52 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగించగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 106 పాయింట్లు నష్టంతో 7,731.80 పాయింట్ల వద్దకు చేరింది

మొత్తం 2,845 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 1,046 కంపెనీలు లాభాలను, 1,615 కంపెనీల ఈక్విటీలు నష్టాలను నమోదు చేశాయి. ఈ క్రమంలో ఒక్క కన్జూమర్ డూరబుల్స్ మినహా అన్ని సూచీలు నష్టాలలోనే పయనించాయి. బ్యాకింగ్, బ్యాకింగ్ నిఫ్టీ, ఐటీ, అటో సూచీలు భారీ నష్టాలను చవిచూడగా, టెక్నాలజీ, ఎఫ్ఎంజీసీ, హెల్త్ కేర్, మెటల్స్ , క్యాపిటల్ గూడ్స్, ఆయల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, చిన్న మధ్య తరహా పరిశ్రమల సూచీలు నష్టాలను ఎదుర్కోన్నాయి. ఈ నేపథ్యంలో ఐడియా, ఏషియన్ పెయింట్స్, గెయిల్, బీపీసీఎల్, కోల్ ఇండియా తదితర సంస్థలు లాభాలను ఆర్జించగా,  హిందాల్కో, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, వీఈడీఎల్  తదితర సంస్థల షేర్లు అధిక నష్టాలను చవిచూశాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Gold and silver  indian rupee  RBI  

Other Articles