విదేశీ సంస్థలకు సర్వధామంలా మారిన భారత విఫణిలోకి మరో కోత్త కారు వచ్చి చేరింది. దేశంలోని సుసంన్నుల కోసం బ్రిటీష్ సుప్రసిద్ద కార్ల తయారీ సంస్థ జాక్వర్ నుంచి మరో కొత్త కారు లాండ్ రోవర్ కారును ఇవాళ అవిష్కరించింది. రేంజ్ రోవర్ ఈవోక్యూ లగ్జరీ ఎస్ యూ వీ మోడల్ ను ఇవాళ ముంబాయిలో సంస్థ ప్రతినిధులు అవిష్కరించారు. ఈ ఎస్ యూ వీ కారు అవిష్కరణతోనే కొత్త బెంచ్ మార్కులను నమోదు చేసుకుంటోందని, తమ సక్సెస్ బాటు 2016 మోడల్ ఎస్ యూ వీ విషయంలోనూ కోనసాగుతుందని జాక్వర్ లాండ్ రోవర్ ఇండియా లిమిటెడ్ ప్రెసిడెంట్ రోహిత్ సేన్ ధీమా వ్యక్తం చేశారు.
ఈవోక్యూ బేస్ మోడల్ ధర రూ. 47.1 లక్షల ( ఎక్స్ షో రూమ్ ధర) నుంచి ప్రారంభమైవుతుందని ఆయన చెప్పారు. ఈ కారు నాలుగు వేరియంట్లలో మార్కెట్లలో లభ్యమవుతుందని కూడా తెలిపారు. ఈ కారు అత్యున్నత మోడల్ ధర 63.2 లక్షల రూపాయలుగా నిర్క్ణయించినట్లుగా తెలిపారు. రేంజ్ రోవర్ ఈవోక్యూ ప్యూర్, రేంజ్ రోవర్ ఈవోక్యూ ఎస్ఇ, రేంజ్ రోవర్ ఈవోక్యూ హెచ్ఎస్ఇ, రేంజ్ రోవర్ ఈవోక్యూ హెచ్ఎస్ఇ డైనమిక్ వేరియంట్లలో కారు మార్కెట్లలో అవిష్కరించారు.
నాలుగు వేరియట్లు సుమారుగా పది విభిన్నమైన రంగులలో అవిష్కరించారు. ఈ కార్లలో సరౌండెడ్ కెమెరా సిస్టమ్, 17 స్పీకర్లు, 825 వాట్ల మెరిడియన్ సరౌండెడ్ సిస్టమ్, రేర్ సిట్ ఎంటర్ టైన్ మెంట్, తొమ్మిది స్పీడులో అటోమెటిక్ ట్రాన్స్ మిషన్, ఎఈడీ పగులు వెలిగే లైట్లతో పాుట హెడ్ అప్ డిస్ ప్లే కూడా పోందుపర్చినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ సరికోత్త కారు దేశంలోని ప్రధాన నగరాలలో 22 రీటైల్ ఔట్ లెట్ లలో మాత్రమే అందుబాటులో వుంటుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more