మార్కెట్లోకి కొత్త ఫోన్లు వస్తూనే ఉన్నాయి. కొత్త కొత్త ఫీచర్లో అందరికి అందుబాటులో ఉండే బడ్జెట్ లో కొత్త మొబైల్స్ మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాయి. తాజాగా లినోవా, అప్పోల నుండి మూడు మొబైల్స్ మార్కెట్ లోకి అడుగుపెట్టాయి. బడ్జెట్ లో ఉండే లెనోవా మొబైల్ తో పాటుగా రెండు ఫ్రంట్ కెమెరాలతో వచ్చిన లెనేవో వైబ్ ఎస్1 మార్కెట్లో సందడి చెయ్యనున్నాయి. ఈ మూడింటి పూర్తి వివరాలు మీ కోసం
లెనోవా వైబ్ ఎస్1:
దేశీయ మార్కెట్లోకి లెనోవో సంస్థ 'వైబ్ ఎస్1' పేరిట నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ-కామర్స్ సైట్ అమెజాన్ నుంచి ఈ ఫోన్ వినియోగదారులకు ప్రత్యేకంగా లభ్యమవుతోంది. కర్వ్డ్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్, డ్యుయల్ ఫ్రంట్ కెమెరాలు దీంట్లోని ప్రత్యేకతలు. ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్, 5 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 1080X1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 8 మెగాపిక్సల్ ప్రైమరీ ఫ్రంట్ కెమెరా, 2 మెగాపిక్సల్ సెకండరీ ఫ్రంట్ కెమెరా, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 64 బిట్ 1.7 జీహెచ్‌జడ్ మీడియాటెక్ ఎంటీ6752 ఆక్టాకోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 4జీ ఎల్టీఈ, 2500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. పెరల్ వైట్, మిడ్నైట్ బ్లూ రంగుల్లో లభిస్తున్న ఈ ఫోన్ ధర 15,999 మాత్రమే
లెనోవా ఆటమ్ 2ఎక్స్:
'ఆటమ్ 2ఎక్స్' పేరిట లావా సంస్థ దేశీయ మార్కెట్లోకి తక్కువ బడ్జెట్లో ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇందులో డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 4.5 ఇంచ్ ఐపీఎస్ డిస్ప్లే, 480X854 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 0.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 3జీ, బ్లూటూత్ 4.0, వైఫై, ఎ-జీపీఎస్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ధర 4,499 మాత్రమే.
అప్పో ఎ33:
అప్పో సంస్థ 'ఎ33' పేరిట నూతన స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లోకి విడుదల చేసింది. మరి కొద్ది రోజుల్లో ఇతర ప్రాంతాల్లోనూ ఈ నూతన మోడల్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇందులో ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, కలర్ ఓఎస్ 2.1 స్కిన్, 5 ఇంచ్ టీఎఫ్టీ డిస్ప్లే, 540X960 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.2 జీహెచ్‌జడ్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, డ్యుయల్ సిమ్ (మైక్రో+నానో), 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 4.0, ఎ-జీపీఎస్, 2400 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ధర 15,500 మాత్రమే.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more