Samsung Galaxy S7 SoC Delivers Record-Breaking Score in Leaked Benchmark

Samsung galaxy s7 soc delivers record breaking score in leaked benchmark

Samsung Galaxy S7 SoC, New Phone from Samsung, Samsung, Benchmark, gadjets, New smart Phones, Phones in 2016, New mobiles arriving in 2016

The anticipated Samsung Galaxy S7 has gone through AnTuTu benchmarks, revealing the scores delivered by Samsung's newly unveiled Exynos 8 Octa 8890 SoC. The unannounced Samsung Galaxy A7 (2016) also appears to have hit the US FCC certification website, tipping its dimensions and battery capacity.

సామ్ సంగ్ నుండి 2016లో అదిరిపోయే ఫోన్

Posted: 11/30/2015 07:07 PM IST
Samsung galaxy s7 soc delivers record breaking score in leaked benchmark

2016లో మార్కెట్ లోకి రానున్న కొత్త 'గెలాక్సీ ఎస్7' అందుబాటులోకి రాకముందే సంచనాలకు తెర తీసింది. గాడ్జెట్ వరల్డ్ లోనే సెన్సేషన్ గా నిలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటి వరకు ఏ స్మార్ట్‌ఫోన్‌కు లేని విధంగా ఓ సరికొత్త రికార్డును సృష్టించింది. డివైస్‌ల ప్రదర్శనకు వెన్నెముకగా భావించే 'బెంచ్ మార్కింగ్ స్కోర్' ఈ ఫోన్‌కు ఎంత వచ్చిందో తెలిస్తే మీరు షాకింగ్‌కు గురవుతారు. అవును, బెంచ్ మార్కింగ్ స్కోర్‌లను ఇచ్చే 'అంటుటు(ANTUTU)' సాఫ్ట్‌వేర్‌లో 'గెలాక్సీ ఎస్7'కి దాదాపుగా 1,03,692 స్కోరు వచ్చింది. ఇప్పటి వరకు ఆయా డివైస్‌లకు వచ్చిన స్కోర్ల కంటే ఇదే అత్యుత్తమం కావడం గమనార్హం.

స్మార్ట్‌ఫోన్ల గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ను అందించే పలు వెబ్‌సైట్లలో ఇప్పుడు 'ఎస్7'కు చెందిన బెంచ్ మార్కింగ్ స్కోర్ హాట్ టాపిక్‌గా మారింది. '64 బిట్ ఏఆర్‌ఎం వెర్షన్8 ఆర్కిటెక్చర్‌'తో శాంసంగ్ సంస్థ సొంతంగా తయారుచేసిన 'ఎగ్జినోస్ 8 ఆక్టా 8890 ప్రాసెసర్‌'ను ఈ ఫోన్‌లో అందిస్తున్నారు. యాపిల్‌కు చెందిన ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్‌లలో ఉండే విధంగానే '3డీ టచ్ లైక్ ప్రెజర్ సెన్సిటివ్ డిస్‌ప్లే'ను ఎస్7లో అందించనున్నారు. కాగా ఎస్7లోని ఎగ్జినోస్ ప్రాసెసర్ త్వరలో రానున్న క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్‌కు ఏ విధమైన పోటీని ఇస్తుందనేది ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఆసక్తిగా మారగా, ఇప్పటి వరకు వచ్చిన స్మార్ట్‌ఫోన్ల కంటే అత్యధిక బెంచ్ మార్కింగ్‌ను సొంతం చేసుకున్న ఈ స్మార్ట్‌ఫోన్ అన్నింటికీ 'రారాజు'గా మారుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఫీచర్లు:
డిస్ ప్లే: 5.5 ఇంచ్(1080-1920)
బరువు: 155 గ్రామ్
బ్యాటరీ: 3300 ఎంఏహెచ్
ప్రాసెసర్:  1.7 గిగా హెడ్జెస్ ఆక్టాకోర్ ప్రాసెసర్
ర్యామ్: 3జిబి
స్టోరేజ్:  16 జిబి 128 జిబి వరకు ఎక్పాండబుల్
కెమెరా:  ఫ్రంట్ 5 మెగా పిక్సల్, బ్యాక్ 13 మెగా పిక్సల్
* 4జి లైట్ సపోర్ట్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles