మార్కెట్లోకి వస్తున్న కొత్త మొబైల్స్ సెల్ ఫోన్ ల ధరలను అంతకంతకు తగ్గించేస్తున్నాయి. గతంలో పది వేలు పెట్టినా దొరకని ఆండ్రాయిడ్ ఫోన్ ఇప్పుడు కేవలం రెండు వేల ఏడు వందలకే వస్తుందంటే నమ్ముతారా..? కానీ నిజం తాజాగా ఆక్వా మొబైల్స్ కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. 'ఆక్వా 3జీ 512' పేరిట లభ్యమవుతున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులు రూ.2,700కే ఈ-కామర్స్ సైట్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఎబోనీ బ్లాక్, పెరల్ వైట్ రంగుల్లో దీన్ని డిజైన్ చేశారు.
ఇందులో డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్, 4 ఇంచ్ ఐపీఎస్ డిస్ప్లే, 480X800 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.2 జీహెచ్‌జడ్ డ్యుయల్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 2 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 0.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2100 ఎంఏహెచ్ బ్యాటరీ, 3జీ, వైఫై వంటి ఫీచర్లు ఉన్నాయి. వాట్సప్, వైబర్, యూట్యూబ్, ఫేస్బుక్, గూగుల్ మ్యాప్స్, ఆఫీస్ సూట్ వంటి యాప్స్‌ను ఇందులో ప్రీ లోడెడ్‌గా అందిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more