Rupee trades lower against US dollar

Rupee trades lower against us dollar

rupee, Rupee value, Rupee Vs Dollar, Stock Market, Indian stocks, Indian share Market, Stock market Progress

The rupee depreciated by 24 paise to hit a two-year low of 66.90 against the US dollar in early trade on Friday, ahead of the RBI planned infusion of liquidity into the system via term repo and open market operations (OMO) routes.

రెండేళ్ల కనిష్టానికి రూపాయి మారకం విలువ

Posted: 12/04/2015 06:42 PM IST
Rupee trades lower against us dollar

భారత స్టాక్ మార్కెట్, ఫారెక్స్ మార్కెట్లు ఈ ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. డాలర్ తో రూపాయి మారకపు విలువ రెండేళ్ల కనిష్ఠానికి దిగజారింది. క్రితం ముగింపుతో పోలిస్తే 30 పైసలు పడిపోయి రూ. 66.95కు చేరుకుంది. మరోవైపు స్టాక్ మార్కెట్లలో సైతం ఇన్వెస్టర్ల కొనుగోలు సెంటిమెంటు అంతంతమాత్రంగానే ఉంది. అమ్మకాల కన్నా కొనుగోళ్లు అధికంగా కనిపిస్తుండటంతో, బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 200 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఆపై స్వల్పంగా తేరుకుని ఉదయం 10:55 గంటల సమయంలో 170 పాయింట్ల నష్టంతో 25,717 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 60 పాయింట్ల నష్టంలో ఉంది.

అమెరికాలో వడ్డీ రేట్లు పెరగవచ్చన్న అంచనాలు భారత మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంటును అమ్మకాల వైపు నడిపించగా, బ్యాంకింగ్, విద్యుత్ కంపెనీల ఈక్విటీలు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ కీలకమైన 7,800 పాయింట్ల వద్ద మద్దతును కూడగట్టుకోవడంలో విఫలమైంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లతో పాటు దేశవాళీ ఫండ్ కంపెనీలు భారీ ఎత్తున ఈక్విటీలను విక్రయించినట్టు సెబీ గణాంకాలు వెల్లడించాయి. శుక్రవారం నాటి ట్రేడింగ్ సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 248.51 పాయింట్లు పడిపోయి 0.96 శాతం నష్టంతో 25,638.11 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ, 82.25 పాయింట్లు పడిపోయి 1.05 శాతం నష్టంతో 7,781.90 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 1.05 శాతం, స్మాల్ క్యాప్ 64 శాతం నష్టపోయాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles