Xiaomi Mi Max India launch: Key sepecifications, features and price

Xiaomi mi max miui 8 launched in india

mi max, xiaomi mi max, mi max india launch, xiaomi mi price in india, mi max price, mi max first look, mi max price india, mi max price in india, mi max specs, xiaomi mi max first look, xiaomi mi max india, xiaomi mi max price, xiaomi mi max price in india, xiaomi mi max launch, mi max launch, mi max launch india, mi max features, xiaomi mi max features, smartphones, technology, technology news

Xiaomi Mi Max, the 6.4-inch display smartphone, has been launch in India today, along with the company's new MIUI8.

భారత విఫణిలోకి షియోమి మి మ్యాక్స్, ఎంఐయుఐ స్మార్ట్ ఫోన్లు

Posted: 06/30/2016 06:52 PM IST
Xiaomi mi max miui 8 launched in india

చైనా యాపిల్ ఫోన్లుగా పేరోందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల సంస్థ షియోమి తన కొత్త స్మార్ట్ ఫోన్ "మి మ్యాక్స్"ను భారత విఫణిలోకి విడుదల చేసింది. మి మ్యాక్స్ తో పాటు షియోమి ఎమ్ఐయూఐ 8 ను ప్రపంచ విఫణీలోకి ప్రవేశపెట్టింది. భారత దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా ఈ నూతన ఫోన్లను షియోమి సంస్థ ప్రతినిధులు ఆవిష్కరించారు. షియోమి మి మ్యాక్స్ ను ఈ ఏడాది మేలోనే చైనాలో ఆవిష్కరించింది. 6.44 అంగుళాల ఫుల్ హెచ్ డీ 342పీపీఐ డిస్ ప్లే కల్గిన ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీ అన్ని ఫోన్లలో కల్లా అతి పెద్ద స్మార్ట్ ఫోన్. మొత్తం మెటల్ బాడీతో, డార్క్ గ్రే, గోల్డ్, సిల్వర్ రంగుల్లో మి మ్యాక్స్ ను భారత మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు.

మి మ్యాక్స్ ను మూడు వేరియంట్లలో చైనాలో ఆవిష్కరించారు.

1. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 1.8జీహెచ్ జడ్ హెక్సా కోర్ స్నాప్ డ్రాగన్ 650 ప్రాసెసర్.. ధర: దాదాపు రూ.15,000
2. 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 1.8 జీహెచ్ జడ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 652 ప్రాసెసర్ .. ధర: దాదాపు రూ.17,000
3. 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్...  ధర: దాదాపు రూ.20,500
అయితే గతంలో మాదిరిగా కేవలం ఒక్క వేరియంట్ నే కంపెనీ భారత్ మార్కెట్లోకి తీసుకొస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

షియోమి మి మ్యాక్స్ ఫీచర్లు...
6.44 అంగుళాల డిస్ ప్లే
హెక్సా కోర్ ప్రాసెసర్
1080x1920 పిక్సెల్స్ రెసుల్యూషన్
ఆండ్రాయిడ్ 6.0.1 ఓఎస్
3 జీబీ ర్యామ్
32 జీబీ స్టోరేజ్
16 మెగాపిక్సెల్ వెనుక కెమెరా
5 మెగా పిక్సెల్ ముందు కెమెరా
4850 ఎంఏహెచ్
డ్యూయల్ సిమ్, 4జీ ఎల్ టీఈ సపోర్టు
203 గ్రాముల బరువు

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : android smartphone  Xiaomi  Mi Max  MIUI 8  India  Indian market  

Other Articles