Vivo X7 and X7 Plus go official with Snapdragon 652 SoC

Vivo launches x7 x7 plus with 4gb ram 16 mp front camera

x7 plus, vivo x7 plus specifications, vivo x7 plus review, vivo x7 plus price, x7 plus launch, x7 plus launch india, x7 plus features, vivo x7 plus features, smartphones, technology, technology news

Vivo X7 Plus smartphone was launched in June 2016. The phone comes with a 5.70-inch touchscreen display with a resolution of 1080 pixels by 1920 pixels

భారత మార్కెట్లోకి విడుదలైన ‘వివో’ రెండు కోత్త స్మార్ట్ ఫోన్లు..

Posted: 07/01/2016 05:23 PM IST
Vivo launches x7 x7 plus with 4gb ram 16 mp front camera

చైనీస్ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు వాటి నూతన ఉత్పత్తులను భారతీయ మార్కెట్లోకి శరవేగంగా ప్రవేశపెడుతూ.. రెట్టించిన ఉత్సహాంతో అమ్మకాలను కోనసాగిస్తున్నాయి. చైనా యాపిల్ ఫోన్ గా ప్రసిద్ది చెందిన  షియోమి సంస్థ నుంచి నుంచి రెండు మి మ్యాక్స్ మి ఎంఐయుఐ ఫోన్లను క్రితం రోజు న్యూఢిల్లీ వేదికగా భారతీయ విఫణిలోకి ప్రవేశపెట్టగా.. ఇవాళ మరో చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో, తన రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో చైనా మార్కెట్లోకి విడుదల చేసింది.

వివో ఎక్స్7, ఎక్స్ 7 ప్లస్ పేర్లతో ఈ ఫోన్లను ఆవిష్కరించింది. వివో ఎక్స్7 ధర దాదాపు రూ.25,000కాగా.. వివో ఎక్స్7 ప్లస్ ధరను ఇంకా వెల్లడించలేదు. వివో  ఎక్స్7 ను జూలై 7 నుంచి, ఎక్స్7 ప్లస్ ను జూలై 15 నుంచి స్టోర్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపింది. ఈ రెండు ఫోన్లు క్వాల్ కామ్ ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 652 ప్రాసెసర్ తో పనిచేయనున్నాయి. ఈ రెండూ 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లను సపోర్టు చేయనున్నాయి. మెటల్ డిజైన్ తో రూపొందిన ఈ ఫోన్లు, ఫింగర్ ప్రింట్ స్కానర్ తో పనిచేయనున్నాయి.

వివో ఎక్స్ 7 ఫీచర్లు...
5.2 అంగుళాల ఫుల్ హెచ్ డీ సూపర్ అమో ల్డ్  డిస్ ప్లే
13 మెగా పిక్సెల్ వెనుక కెమెరా
16 మెగా పిక్సెల్ ముందు కెమెరా
డ్యూయల్ సిమ్
3000ఎంఏహెచ్ బ్యాటరీ
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్
బ్లూటూల్ 4.1, జీపీఎస్/ఏ-జీపీఎస్, వైఫై 802, జీపీఆర్ఎస్/ఈడీజీఈ, 3జీ, 4 జీ, మైక్రో యూఎస్ బీ

వివో ఎక్స్7 ప్లస్ ఫీచర్లు...
5.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ సూపర్ అమో ల్డ్ డిస్ ప్లే
16 మెగాపిక్సెల్ వెనుక కెమెరా
16 మెగా పిక్సెల్ ముందు కెమెరా
డ్యూయల్ సిమ్
4000ఎంఏహెచ్ బ్యాటరీ
ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : android smartphone  x7  x7 plus  India  Indian market  

Other Articles