Sensex closes 112 points lower, Nifty below 8350; Coal India rises 1.5%

Sensex slips 111 points snaps 6 sessions of gains

sensex, nifty, indian share market, indian stock exchange, sensex at a low, two year low of sensex, janet yellen, janet yellen united states reserve federal chairperson, united states federal reserve bank, united states federal reserve chairperson

Sensex snapped six-day winning streak while 50-share Nifty closed below its crucial psychological level of 8,350 as investors booked profits in auto, IT power and oil & gas stocks.

లాభాల స్వీకరణకు క్యూ కట్టిన మదుపరులు.. నష్టాల్లో మార్కెట్లు..

Posted: 07/05/2016 05:41 PM IST
Sensex slips 111 points snaps 6 sessions of gains

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలను మూటగట్టుకున్నాయి. అసియా మార్కెట్ల నుంచి వచ్చిన మిశ్రమ పవనాలకు తోడు.. మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో దేశీయ స్టాక్మార్కెట్లు నష్టాలను ఎదుర్కొన్నాయి. బ్రెగ్జిట్ ఫలితాల తరువాత వాటిని అధిగమించిన స్టాక్ మార్కెట్లు ఆరు రోజులుగా వరుస లాభాలను అర్జిస్తున్న క్రమంలో మదుపరులు ఇవాళ లాభాల కోసం క్యూకట్టారు. దీంతో దలాల్ స్ట్రీట్లో   సూచీలు  స్వల్పనష్టాలను చవిచూస్తున్నాయి. గత ఆరు సెషన్లలో 881 పాయింట్లు లాభపడంతో ఇన్వెస్టర్లు లాభాలవైపు మొగ్గు చూపారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్, 27 వేల 200 లకు దిగువన నమోదు కాగా, నిఫ్టీ కూడా 8750 మార్కుకు దిగువన నమోదైంది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లతో పోలిస్తే, దిగ్గజ కంపెనీల వాటాలు అధిక ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఇవాళ మార్కట్ ముగిసేసరికి, సెన్సెక్స్ సూచిక 111.89 పాయింట్లు నష్టంతో 27,166.87 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 34.75 పాయింట్లు నష్టంతో 8,335.95 పాయింట్ల వద్దకు చేరాయి. ఇవాళ ఉదయం మార్కట్లు ప్రారంభంలోనే సెన్సెక్స్ 33పాయింట్లు 27,245దగ్గర,  ఎన్ఎస్ఇ 19పాయింట్ల నష్టంతో నిఫ్టీ 8,351 వద్ద కొనసాగాయి. అ తరువాత మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్లాట్ గా వున్న మార్కెట్లు మదుపరులు లాభాలకు దిగడంతో క్రమంగా నష్టాలను ఎదుర్కోన్నాయి.

ఇవాళ్లి ట్రేడింగ్ లో మొత్తంగా 2893 సంస్థలకు చెందిన షేర్లు ట్రేడింగ్ లో పాల్గోనగా, 1281 సంస్థలకు చెందిన షేర్లు లాభాలను అర్జించగా, 1474 సంస్థలకు చెందిన షేర్లు నష్టాలను చవిచూశాయి. కాగా 138 సంస్థల షేర్లు తటస్థంగా వున్నాయి. ఈ క్రమంలో క్యాపిటల్ గూడ్స్, హెల్త్ కేర్, మెట్సల్, నిఫ్టీ మిడ్ క్యాప్ రంగాలలోని షేర్లు లాభాలను అర్జించగా, అటో, బ్యాంకింగ్, బ్యాంకింగ్ నిఫ్టీలకు చెందిన షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకోగా మిగిలిన అన్ని సూచీలకు చెందిన షేర్లు స్వల్ప నష్టాలను చవిచూశాయి. ఈ నేపథ్యంలో అరవిందో ఫార్మా, కోల్ ఇండియా, యస్ బ్యాంక్, బోష్ లిమిటెడ్, బీహెచ్ఈఎల్ తదితర తదితర సంస్థల షేర్లు లాభాలను ఆర్జించగా, గెయిల్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్ టెల్ తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.    

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sensex  nifty  indian share market  indian stock exchange  

Other Articles