ఈ-కామర్స్ దేశీ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరోసారి రారాజుగా నిలిచింది. తన ప్రధాన ప్రత్యర్థులకు చెక్ పెట్టి దేశంలో నెం.1 గా నిలిచింది. అటు ఆన్లైన్ క్యాబ్ అగ్రిగేషన్ స్పేస్ లో ఓల ఫస్ట్ ప్లేస్ కొట్టేసింది. రెడ్ సీర్ కన్సల్టింగ్ విడుదల చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనాయి. 50 శాతం మార్కెట్ షేర్ తో ఫ్లిప్ కార్ట్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా స్నాప్ డీల్ రెండవస్థానం దక్కించుకుంది. అమెజాన్ మూడవ స్థానానికి పరిమితమైంది. ఈ కామర్స్ విభాగంలో ఫ్లిప్ కార్ట్ 35-37, స్నాప్‌డీల్ 21-23శాతం, అమెజాన్ 17-19 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది.
అయితే, పరిస్థితి స్నాప్‌డీల్ కు ప్రకాశవంతంగా లేదని అభిప్రాయపడింది. 2016 మొదటి త్రైమాసికంలో అమెజాన్ అమ్మకాలు బావున్నాయని, స్నాప్ డీల్ ను అధిగమించిందనీ రెడ్ సీర్ సీఈఓ అనిల్ కుమార్ చెప్పారు. ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో అమెజాన్ దూకుడుగా ఉందని, రాయితీలు, ప్రకటనల మీద ఖర్చు కొనసాగిస్తోందని ఈ స్టడీ తెలిపింది. గత ఏడాది దేశ ఈ కామర్స్ బిజినెస్ 13 బిలియన్ల డాలర్లుగా నమోదైంది. 2012 లో కేవలం మూడు బిలియన్ డాలర్లు ఉన్న ఈ మార్కెట్ గణనీయమైన గ్రోత్ సాధించిందని స్టడీ తెలిపింది. 2016 మొదటి క్వార్టరలో అమ్మకాలు కొద్దిగా క్షీణించాయని వివరించింది.
ప్రధాన ప్రత్యర్థి ఉబెర్ తో పోలిస్తే వ్యాపారంలో రెట్టింపు వేగంతో దూసుకుపోయిన ఓల మార్కెట్ లీడర్ గా నిలిచింది. 2015 లో 61 శాతం మొత్తం మార్కెట్ వాటాతో ఓల టాప్ లో నిలవగా, ఉబెర్ 26 శాతం వాటా తో సరిపెట్టుకుంది. ఆన్ లైన్ ట్యాక్సీ సెగ్మెంట్ లో ప్రతి క్వార్టర్ కి 25 శాతం పెరుగుదల కనిపిస్తోందని ఈ నేపథ్యంలో4 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నామన్నారు. ఇటీవల లాంచ్ చేసిన ఓల మైక్రో ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించిందని తెలిపింది. కాగా ఫ్లిప్ కార్ట్ ను తోసి రాజనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో అమెజాన్ పెట్టుబడుల వరదను పారిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more