ఇంటర్ నెట్ తొలి రోజుల్లో అంతర్జాల ప్రపంచాన్ని ఏలిన సెర్చ్ ఇంజన్ దిగ్గజ సంస్థ యాహూ కనుమరుగుకానుంది. చానాళ్లుగా అర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న ఈ సంస్థను ప్రముఖ వైర్లెస్ దిగ్గజం వెరిజోన్ కొనుగోలు చేసింది. 4.83 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.32,491.41కోట్లు) యాహూ ఇంటర్నెట్ ఆస్తులను కొనుగోలు చేస్తున్నట్టు వెరిజోన్ ప్రకటించింది. ఈ కొనుగోలు డీల్ మొత్తం నగదు రూపంలో ఉండనుందని తెలిపింది. మొదటి నుంచి గట్టి పోటీదారుడిగా వచ్చిన వెరిజోన్ చివరికి యాహూను కైవసం చేసుకుంది.
యాహూ వ్యాపారాలను వెరిజోన్ కొనుగోలు చేయడం వల్ల, తన ఏఓఎల్ ఇంటర్నెట్ బిజినెస్‌లను వెరిజోన్ పెంచుకోనుంది. యాహూ అడ్వర్టైజింగ్ టెక్నాలజీ టూల్స్, సెర్చ్, మెయిల్, మెసెంజర్ లాంటి ఇతర ఆస్తులకు మాత్రమే ఈ డీల్ పరిమితం కానుంది. తమ ఆపరేటింగ్ బిజినెస్‌ల అమ్మకం, ఆసియన్ అసెంట్ ఈక్విటీ షేర్లను వేరుచేయడానికి ఈ డీల్ సమర్థవంతంగా ఉపయోగపడుతుందని యాహూ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మారిస్సా మేయర్ ఓ ప్రకటనలో తెలిపారు. షేర్‌హోల్డర్స్ విలువను అన్ లాక్ చేయడానికి ఈ ప్లాన్ కీలకమైన అడుగు అని పేర్కొన్నారు.
యాహూ రియల్ ఎస్టేట్ ఆస్తులకు, అలీబాబాలోని షేర్లకు, జపాన్‌లోని యాహు షేర్లకు, యాహూ కన్వర్టబుల్ నోట్స్‌కు, కొన్ని మైనార్టీ ఇన్వెస్ట్మెంట్లకు, నాన్-కోర్ పేటెంట్లకు ఈ అమ్మక ఒప్పందం వర్తించదని తెలుస్తోంది. అలీబాబా, జపాన్ ఇన్వెస్ట్మెంట్ల విలువ దాదాపు 40 బిలియన్ డాలర్లు(సుమారు రూ.2,69,080కోట్లు). శుక్రవారం మార్కెట్లు ముగిసేనాటికి యాహూ 37.4 బిలియన్ డాలర్ల(రూ.2,51,589.8కోట్ల) మార్కెట్ విలువను కలిగి ఉంది. 140 మిలియన్లకు పైగా యూజర్లతో ఉన్న వెరిజోన్ ..మీడియా, ప్రకటనల వ్యాపారం కొనుగోలు కోసం అడ్వర్ టైజింగ్ టెక్నాలజీ ప్లాట్ ఫాంని రూపొందించాలనే యోచనలో యాహూ పై కన్నేసింది.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more