స్టాక్‌మార్కెట్లు ఇవాళ నష్టాల బాటపట్టాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముగిసిన తరుణంలో ఇక దేశవ్యాప్త ప్రజలతో పాటు ఇటు మదుపరులు కూడా ఓటరు తీర్పు కోసం వేచి చూస్త్తున్న క్రమంలో కాసింత ముందు జాగ్రత్తాగా లాభాల స్పీకరణకు మొగ్గుచూపారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సానుకూల పవనాలను అందిపుచ్చుకున్నా.. దేశీయ సూచీలు లాభాలను మాత్రం అందుకోలేక పోయాయి. ఓటరు నాడి అనుకూలంగా వుండని పక్షంలో కేంద్రం ఎలాంటి చర్యలకు పూనుకుంటుంది.. అలా కాని పక్షంలో ఎలా వ్యవహరించనుందన్న విషయంతో డోలాయమానంలోకి చేరిన మదుపురులు లాభఆలను స్వీకరణకు దిగడం మార్కెట్లకు నష్టాలు తప్పలేదు.
ఇక దీనికి తోడు అమెరికా ఫెడ్ రిజర్వు త్వరలో ద్రవ్య పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో కూడా మదుపరులను అలోచనలో పడేసింది. సెన్సెక్స్ 97.62పాయింట్లు నష్టపోయి 28901 వద్దకు చేరుకోగా.. నిఫ్టీ 22పాయింట్లు నష్టపోయి 8924 వద్దకు చేరింది. బ్యాకింగ్, హెల్త్‌కేర్ రంగాలు తప్పితే మిగిలిన రంగాల షేర్లు ప్రధానంగా నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. బాష్, యస్‌బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్, ఐషర్ మోటార్స్, కోటక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ఉండగా.. ఐడియా సెల్యూలార్, టాటాస్టీల్, ఓఎన్జీసీ, టెక్‌మహీంద్రా, టాటామోటార్స్ షేర్లు నష్టపోయాయి. నిక్కీ, షాంఘై కాంపోజిట్ తప్పితే మిగిలిన ప్రపంచ మార్కెట్లు అన్నీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more