స్మార్ట్‌ఫోన్ అన్నది ఒకప్పుడు సోషల్ స్టేటస్ కానీ ఇప్పుడు అది నిత్యావసర వస్తువుగా మారిపోయింది. దీంతో ప్రతీ ఒక్కరి చేతిలోనూ అది వుండాలన్న సంకల్పంతో పలు కంపెనీలు అత్యంత చౌక ధరలకు దానిని వినియోగ దారులకు అందుబాటులోకి తేవాలని బావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ సామాన్య ప్రజలకు కూడా అందుబాటు ధరలో తీసుకువస్తామని ఇప్పటికే రిలయన్స్ జియో ప్రకటించింది కూడా. అధునాతన ఫీచర్లు కలిగిన ఫోన్లు రూ.10వేలలోపే అందుబాటులోకి తీసుకువస్తామని కూడా ఆ మధ్యకాలంలో వార్తలు వచ్చాయి.
అయితే ఇందుకోసం చైనా కంపెనీతో కూడా చర్చలు జరిగాయని గత జనవరి మాసంలోనే వీటిని తీసుకువస్తామని చెప్పినప్పటికీ.. అది కాస్త అలస్యం అవుతోందని టాక్. ప్రస్తుతం చైనాకు చెందిన మొబైల్ చిప్ తయారీ సంస్థ స్ప్రెడ్ట్రమ్ కమ్యూనికేషన్ ఈ మేరకు అడుగులు పడుతున్నాయి. బేసిక్ ధరల్లో 4జీ ఫోన్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళిక రచిస్తోంది. ప్రస్తుతం కొన్ని ఫోన్ తయారీ సంస్థలు అందిస్తున్న ధరలకన్నా సగం ధరకే 4జీ సదుపాయంతో పనిచేసే స్మార్ట్‌ఫోన్ తీసుకురావాలని యోచిస్తోంది.
రూ.1500లకే 4జీ సదుపాయంతో పనిచేసే ఫీచర్డ్ పోన్ ను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని స్ప్రెడ్టర్మ్ భారత్ ఉన్నతాధికారి నీరజ్ శర్మ తెలిపారు. ఇప్పటికే దేశీయ సంస్థలైన లావా, మైక్రోమ్యాక్స్లు రూ.3వేల స్థాయిలో 4జీ సదుపాయం కలిగిన ఫోన్లను విక్రయిస్తున్నాయి. కార్బన్ కూడా తక్కువ ధరకే స్మార్ట్ఫోన్లను అందించాలని యోచిస్తోంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ప్రధానంగా 4జీ సేవలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో జియో కూడా రూ.1500లకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తోంది. అయితే ఎప్పటికీ ఈ చౌకదర స్మార్ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చేనో వేచి చూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more