ప్రపంచ మార్కెట్ల గమనం సానుకూల దిశగా కొనసాగుతున్న నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక గరిష్టాలను తాకుతూ మరో మైలు రాయిని అందుకున్నాయి. మునుపెన్నడూ తాకని ఉన్నత శిఖరాలను అందుకుని రికార్డులను నమోదు చేసుకుంటున్నాయి. అల్ టైం హై రికార్డులను నమోదు చేసుకుంటూ మదుపరులలో కొత్త జోష్ ను నింపుతున్నాయి. అరంభం నుంచి రికార్డ్ లాభాలతో మెరుపులతో మురిపిస్తున్న మార్కెట్లు వరుస రికార్డులు స్థాయిలు నమోదుచేశాయి. ముఖ్యంగా మిడ్ సెషన్లో ఊపందుకున్న కొనుగోళ్ల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త శిఖరాలను అధిరోహించాయి.
ఉదయం ప్రారంభం నుంచే మార్కెట్లు పాజిటివ్ గా ట్రెండ్ అవుతున్నాయి. ఉదయం నుంచి లాభాలబాటలో వున్న మార్కెట్లకు మిడ్‌సెషన్ అనంతరం కొనుగోళ్ళ ధోరణి బాగా పుంజుకుంది. ఈ నేపథ్యంలో నిఫ్టీ 88.65 పాయింట్లు ఎగిసి రికార్డు స్థాయిలో 9307 వద్ద ముగిసింది. మార్కెట్ చరిత్రలో తొలిసారి నిఫ్టీ 9,300 ని తాకింది. సెన్సెక్స్ 287.40 పాయింట్లు జంప్‌చేసి 29,943 వద్ద క్లోజైంది. మరోవైపు ఉదయం నుంచి రికార్డ్ లెవల్స్ ఉన్న బ్యాంక్ నిఫ్టీ తన హవాను మరింత పొడిగించింది. తొలిసారి 22,000 పాయింట్లను అధిగమించింది.
అటు విస్తారమైన మిడ్ క్యాప్ సూచీ కూడా సరికోత్త మైలు రాయిని తాకింది. గతంలో ఎన్నడూ తాకని ఉన్నత శిఖరాలను తాకింది. సెన్సెక్స్ లో మిడ్ క్యాప్ సూచీ 18 వేల 21 వేల పాయింట్లను తాకగా, ఇటు నిఫ్టీలో 14వేల 724 పాయింట్లను అందుకుని కొత్త చరిత్ర సృష్టించింది. దీంతో సెన్సెక్స్ దాదాపు 250పాయింట్లకు పైగా లాభపడగా, రియల్టీ, ఎఫ్ఎంసీజీ, ఆటో, బ్యాంక్ నిఫ్టీ, ఫార్మా సెక్టార్లు గ్రీన్‌లో ట్రేడ్ అయ్యాయి. రిలయన్స్ , ఎంఎం, ఇండియా బుల్స్ షేర్ల లాభాలు బుల్ రన్ లో ప్రధాన పాత్ర పోషించాయి.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more