Billion Capture Plus launched in India ఫ్లిప్ కార్ట్ నుంచి తొలి స్మార్ట్ ఫోన్.. బిలియన్ కాప్చర్ ప్లస్..

Billion capture plus smartphone sales begins on nov 15

flipkart, flipkart billion capture plus smartphone, flipkart offers, flipkart phone, flipkart billion capture plus, flipkart mobile, flipkart billion capture mobile price, flipkart billion phone features, flipkart billion plus phone price

Flipkart Billion Capture Plus smartphone will feature dual-rear cameras, full HD display. The Billion Capture Plus smartphone's price, specifications are now confirmed

ఫ్లిప్ కార్ట్ నుంచి తొలి స్మార్ట్ ఫోన్.. బిలియన్ కాప్చర్ ప్లస్..

Posted: 11/10/2017 05:53 PM IST
Billion capture plus smartphone sales begins on nov 15

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ తన తొలి బ్రిలియంట్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. క్యాప్చర్+ పేరుతో ఈ ఫోన్ ను విడుదల చేసింది. ఈ నెల 15 నుంచి ఇది విక్రయానికి రాబోతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రధాన ఫీచర్లు.. డ్యూయల్ రియర్ కెమెరాలు, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, అపరమిత క్లౌడ్ స్టోరేజ్. సచిన్ బన్సాల్ అధినేత అయిన ప్రైవేట్ లేబుల్ ఆర్మ్‌, బిలియన్ బ్రాండు కింద ఫ్లిప్ కార్ట్ దీన్ని రూపొందించింది.

ఈ స్మార్ట్ ఫోన్ కోసం ఫ్లిప్ కార్ట్ ఓ ప్రత్యేక పేజీని కూడా ఏర్పాటు చేసింది. వేగవంతంగా ఛార్జింగ్ చేసుకునే సపోర్టును ఇది కలిగి ఉన్నట్టు ఫ్లిప్ కార్ట్ రివీల్ చేసింది. రెండు వేరియంట్లలో ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ విడుదల చేసింది. ఒకటి 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌. దీని ధర 10,999 రూపాయలు. మరొకటి 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌. దీని ధర 12,999 రూపాయలు. మైస్టిక్ బ్లాక్, డిసర్ట్ గోల్డ్ రంగుల్లో ఇది అందుబాటులోకి రానుంది. నో కాస్ట్ ఈఎంఐ, డెబిట్‌, క్రెడిట్ కార్డులపై డిస్కౌంట్లు ఈ ఫోన్ పై లభించనున్నాయి.

ఫ్లిప్ కార్ట్ బిలియన్ క్యాప్చర్‌+ ఫీచర్లు


ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 625 ఎస్‌ఓసీ
ఆండ్రాయిడ్ 7.1.2 నోగట్
5.5 అంగుళాల ఫుల్‌-హెచ్డీ డిస్‌ప్లే
3జీబీ, 4జీబీ ర్యామ్‌ (రెండు వేరియంట్లు)
128జీబీ వరకు విస్తరణ మెమరీ
3500 ఎంఏహెచ్ బ్యాటరీ
13 మెగాపిక్సెల రియర్ రెండు కెమెరాలు
8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : flipkart  billion capture plus  smartphone  E commerce  technology  smartphones  

Other Articles