ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగోసారి కూడా స్మార్ట్ ఫోన్ అభిమానుల అదరణను చూరగోని కేవలం 120 సెకన్లలో ఔట్ అప్ స్టాక్ గా మారిన స్మార్ట్ ఫోన్ ఏదైనా వుందా అంటే.. అది ఆనర్ 9 లైట్ అని చెప్పకతప్పదు. ఇశాళ నాలుగో పర్యాయం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు ప్రారంభమైన అమ్మకాలు కేవలం రెండు నిమిషాలలోనే ఔట్ అప్ స్టాక్ బోర్డు దర్శనమివ్వాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి, సరిగ్గా షియోమి రెడ్ ఎంఐ ఫోన్ తరహాలోనే ఈ ఫోన్ కూడా తమ ఫ్లాష్ సేల్ ద్వారా తన ఉత్పత్తుల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటుంది.
ఆనర్ 9 లైట్ స్మార్ట్ ఫోన్‌కి వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లు ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లాష్ సేల్ ఇవాళ 12 గం.లకు ఆన్ లైన్ మార్కెట్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ లో ప్రారంభమైంది. ప్రారంభమైన రెండు నిమిషాల్లోనే ఆనర్ 9 లైట్ ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ఆనర్ 9 లైట్ స్మార్ట్ ఫోన్ కు ఫ్లాష్‌సేల్ నిర్వహించడం ఇది నాలుగోసారి. అయినప్పటికీ ఇంత ఆదరణ లభించడం ఆనందంగా ఉందని హువాయి వినియోగదారుల బిజినెస్ హెడ్ సంజీవ్ అన్నారు.
ఇప్పటివరకు జరిగిన ఫ్లాష్ సేల్ లలో ఇదే అత్యంత వేగంగా జరిగిందని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. మొదటి ఫ్లాష్ సేల్ 6 నిమిషాల్లో, రెండో ఫ్లాష్ సేల్ 3 నిమిషాల్లో పూర్తయిందని తెలిపింది. 3జీబీ, 4జీబీ వేరియంట్లలో ఆండ్రాయిడ్ ఓరియో ఆపరేటింగ్ సిస్టం, 3000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్థ్యం, 5.65 ఇంచుల తెర, హువాయి హైసిలికాన్ కిరిన్ 659 ప్రాసెసర్ ఇందులో ఉన్నాయి. దీని ధర రూ. 10,999. కాగా, 64 జీబి ఇంటర్నల్ స్టోరేజీ స్మార్ ఫోన్ ధర 14 వేల 999 రూపాయలు.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more