కేంద్ర వార్షిక బడ్జెట్ లో మదుపర్ల దీర్షకాలిక మూలధనంపై పది శాతం పన్ను విధించే కొత్త నిబంధనను అమలుపర్చడంపై మదుపర్లలో అసంతృప్తి నెలకొంది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయాయి. దీర్ఘకాల మూలధన లాభం రూ. లక్ష మించితే 10శాతం పన్ను విధిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్లో ప్రకటించడంతో ఈ నిర్ణయం మార్కెట్ సెంటిమెంట్ ను తీవ్రంగా దెబ్బతీసింది.
ఇవాళ మార్కెట్లు ప్రారంభమైనప్పటి నుంచి అదే సెంటిమెంట్ కొనసాగుతుండటంతో సూచీలు భారీగా పతనమయ్యాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ 250 పాయింట్లకు పైగా కోల్పోయింది. ఇక నిఫ్టీ కూడా 11వేల మైలురాయి కిందకు పడిపోయింది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు కూడా బలహీనంగా ఉండటం మార్కెట్ సెంటిమెంట్‌ను బాగా దెబ్బతీసింది. దీంతో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు.
దీంతో ముగింపు సమయానికి సెన్సెక్స్ ఏకంగా 840 పాయింట్లు కోల్పోయి 35,066 వద్దకు దిగజారింది. ఇక అటు నిఫ్టీ కూడా 256 పాయింట్ల నష్టంతో 10,760 కి పడిపోయింది. దీంతో టాటాపవర్, ఎస్బీఐ, మారుతి సుజుకీ, కొటక్ మహింద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కూరుకుపోయాయి. కాగా, టెక్ మహింద్రా, హెచ్ సి ఎల్ టెక్, టీసీఎస్, హెచ్ యు ఎల్, ఐటీసీ సంస్థల షేర్లు లాభాలను అర్జించాయి.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more