రెడ్ ఎంఐ ప్లాగ్ షిప్ తో భారతీయ విఫణిలో సంచలనాలకు తెరతీస్తున్న చైనాకు చెందిన షియోమీ సంస్థ.. మరో నూతన ఉత్పాదనతో మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే దేశీయ మార్కెట్లో అందులోనూ మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల విభాగంలో రారాజులా వెలుగొందిన సామ్ సంగ్ ను వెనక్కి నెట్టి దూసుకుపోతున్న షియోమీ.. మరో నూతన స్మార్ట్ ఫోన్ ను ఈ నెల 14న దేశీయ విఫణిలో అవిష్కరించనుంది. ఇటీవలే రెడ్ ఎంఐ నోట్ 5, 5 ప్రోలను ఆవిష్కరించిన షియోమీ.. రెడ్ ఎంఐ 5ఏ మోడల్ ను కూడా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
ఇలా నిత్యం తన నూతన అవిష్కరణలో భారతీయుల అదరణను చూరగోన్న ఈ సంస్థ.. నెల వ్యవధిలోనే రెండు టీవీలను మార్కెట్లోకి ప్రవేశపెట్టి.. టీవీల విక్రయాలలో కూడా తనదే పైచేయి సాధించాలని ఊవ్విళ్లూరుతుంది. ఈ క్రమంలో ఈ నెల 14న మరో స్మార్ట్ ఫోన్ ను షియోమీ సంస్థ విడుదల చేయబోతోంది. అది రెడ్ ఎంఐ 5ఏకి అదనపు ఫీచర్లతో వస్తున్న నూతన ఉత్పాదన లేక పూర్తిగా భిన్నంగా వస్తున్న మరొ నూతన స్మార్ట్ ఫోనా..? అన్న విషయంలో మాత్రం కంపెనీ ఇంకా రహస్యంగానే వుంచింది. అయితే అది రెడ్ మీ 5 కావచ్చని, లేదా మరో స్మార్ట్ టీవీ కావచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.
రెడ్ ఎంఐ 4కు తదుపరి జనరేషన్ మోడల్ 5గా రానుంది. 4ఏ మోడల్ స్థానంలో 5ఏను తీసుకురాగా, రెడ్ ఎంఐ 4, 2017 మోడల్ కు సమాంతరంగా మరో స్మార్ట్ ఫోన్ ను ఇంకా విడుదల చేయలేదు. కనుక ఈ నెల 14న ఆవిష్కరించే మోడల్ అదేనని భావిస్తున్నారు. రెడ్ ఎంఐ 5 మోడల్ లో 5.7 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, 1.8 గిగాహెర్జ్ ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 450 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ నౌగత్ 7.1 వెర్షన్ ఓఎస్, ఎంఐయూఐ 9, 2జీబీ, 3జీబీ ర్యామ్, 16జీబీ, 32జీబీ వెర్షన్లతో ఈ మోడల్ ను కంపెనీ తీసుకొస్తున్నట్టు సమాచారం. ఇంకా 12 మెగా పిక్సల్స్ రియర్ కెమెరా, ఎల్ ఈ డీ ఫ్లాష్, ముందు భాగంలో 5మెగా పిక్సల్స్ కెమెరా, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటాయి.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more