భారతీయ విఫణిలో చైనా స్మార్ట్ ఫోన్ల విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఓ వైపు ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థల ఉత్పాదనలకు పోటీగా వస్తున్న చైనా సంస్థల ఫోన్లపై భారతీయులు తమ అదరణను చాటుకుంటున్నారు. ఇప్పటికే షియోమీ నెంబర్ వన్ స్థానాన్ని అక్రమించేందుకు రెడీ అవుతుండగా, మరోవైపు చైనా హ్యాండ్‌సెట్ మేకర్ వివో సంస్థకు చెందిన ఫోన్లు కూడా మార్కెట్లలో హల్ చల్ చేస్తున్నాయి. దీంతో వివో సరికొత్త స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసేందుకు రెడీ అయింది.
వివో వీ9 పేరుతో వస్తున్న ఈ ఫోన్ అచ్చం యాపిల్ ఐఫోన్ ‘ఎక్స్’ను పోలి ఉంటుందని సంకేతాలను ఇప్పటికే విడుదల కావడంతో తక్కువ ధరకు యాఫిల్ డిజైన్ ఫోన్ ను సోంతం చేసుకోవాలని కలలు కనే వారికి ఇది సదావకాశం అంటున్నారు స్మార్ట్ ఫోన్ ప్రియులు. ఈనెల 27న మార్కెట్లోకి వస్తున్న ఈ ఫోన్ ధర రూ.25 వేలు ఉండే అవకాశం ఉంది. డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తున్న వీ9లో 24 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉండడం విశేషం. గతేడాది నవంబరులో వివో వీ7 మార్కెట్లోకి వచ్చింది. ఇందులోనూ 24 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉపయోగించారు. ధర రూ.18,990. బార్సిలోనాలో గత నెలలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ‘ఎపెక్స్’ పేరుతో ‘ఫుల్ వ్యూ’ స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించింది.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more