అంతర్జాతీయంగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అటు క్రూడ్ అయిల్ తో పాటు ఇటు డాలర్ బలాన్ని పుంజుకోవడంతో క్రమంగా గత కొన్నాళ్లుగా బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరులు అమ్మకాలకు మొగ్గచూపుతున్న కారణంగా అంతర్జాతీయంగా బంగారం ధరలు దిగివస్తున్నాయి, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో పది గ్రాముల బంగారం ధర చాలా రోజుల తరువాత రూ. 50 వేల దిగువకు వచ్చింది. అమెరికా డాలర్ బలపడుతూ రావడం, ఆరు వారాల గరిష్ఠానికి డాలర్ చేరడంతోనే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ వారంలో వరుసగా నాలుగు రోజులుగా పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.2500 మేర తగ్గింది. అటు అంతర్జాతీయ మార్కెట్లో 0.3శాతం మేర తగ్గిన ఔన్సు బంగారం ధరల 1858 డాలర్లకు జారింది, ఇక క్రితం రోజున తన దారి వేరని పెరిగిన వెండి కూడా ఇవాళ పడిపోయింది, అంతర్జాయంగా 2.8శాతం మేర ధర కుదించుకుపోయిన ఔన్సు వెండి ధర 22.23 డాలర్లకు చేరింది.
ఎంసీఎక్స్ లో అక్టోబర్ ఫ్యూచర్స్ బంగారం ధర ఇవాళ. 405 తగ్గి రూ. 49,293కు చేరుకుంది. ఇదే సమయంలో డిసెంబర్ ఫ్యూచర్స్ కు సంబంధించి, వెండి ధర కిలోకు రూ. 1,890 పడిపోయి రూ. 59,323కు చేరుకుంది. ఇక స్పాట్ మార్కెట్లో ఓ దశలో వెండి ధర రూ. 56,710 వరకూ దిగజారింది, ఇక ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర 1.9 శాతం పడిపోయి రూ. 950 మేర తగ్గగా, మరోవైపపు వెండి ధర 4.5 శాతం పతనమై కిలోకు రూ. 2700 మేర దిగజారింది. ఇటు దేశీయంగా కూడా బంగారానికి డిమాండ్ పెద్దగా లేకపోవడంతో బంగారం విక్రయాలు పెద్దగా సాగడం లేదు.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more