దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కూడా పర్యావరణ హితమైన ఈవీ వాహనాల తయారీలో నిమగ్నమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ సంస్థ తన భవిష్యత్తు ఎలక్ట్రిక్, కొత్త జనరేషన్ వాహన ఉత్పత్తుల కోసం కొత్త బ్రాండ్‌ను ఆవిష్కరించింది. దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో శాఖలున్న హీరో మోటోకార్ప్ సంస్థ 'వీదా' పేరుతో తీసుకొచ్చిన కొత్త బ్రాండింగ్‌ను సంస్థ చైర్మన్ బ్రిజ్‌మోహన్‌లాల్ ముంజాల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ఏడాది జూలై 1న మొదటి ఎలక్ట్రిక్ మోడల్‌ను విడుదల చేయనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో ఉన్న తయారీ ప్లాంట్‌లో మొదటి ఈవీ మోడల్‌ను ఉత్పత్తి చేసి, ఈ ఏడాది ఆఖర్లో వినియోగదారులకు డెలివరీ చేయనున్నట్లు కంపెనీ వివరించింది. ఈ సందర్భంగా మాట్లాడిన సంస్థ చైర్మన్, సీఈఓ పవన్ ముంజల్.. వీదా బ్రాండ్ కోసం 100 మిలియన్ డాలర్ల(సుమారు రూ. 761 కోట్ల)తో గ్లోబల్ సస్టైనబులిటీ ఫండ్‌ను ప్రకటించారు. ఈ నిధుల ద్వారా అంతర్జాతీయంగా కొత్త బ్రాండ్‌ను పటిష్టం చేయడానికి వివిధ భాగస్వామ్యాలను కుదుర్చుకునేందుకు వినియోగించనున్నట్లు తెలిపారు.
అంతేకాకుండా మొత్తం 10 వేల మంది ఎంటర్ప్రెన్యూర్ లను ప్రోత్సహించే లక్ష్యాన్ని కలిగి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త బ్రాండ్ గురించి వివరించిన పవన్ ముంజాల్ 'వీదా' అంటే జీవితం. ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని సృష్టించడం ఈ బ్రాండ్ ముఖ్య ఉద్దేశ్యమని, మెరుగైన మార్గంలో ముందుకెళ్లడమని చెప్పారు. ఇది ప్రస్తుతం తరంతో పాటు రాబోయే తరాలను సూచించే పేరుగా భావిస్తున్నామని వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Sep 29 | విద్యుత్ కార్ల విషయంలో మొదటి నుంచీ దూకుడుగా ఉన్న టాటా మోటార్స్ భారత మార్కెట్లో మరో విద్యుత్ కారును లాంచ్ చేసింది. టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది.... Read more
Sep 16 | ప్రపంచంలోనే తొలి ఫ్లైయింగ్ బైక్ డెట్రాయిట్ ఆటో షోలో గురువారం సందడి చేసింది. జపనీస్ స్టార్టప్ ఏర్‌విన్స్ టెక్నాలజీస్ ఈ ఫ్లైయింగ్ బైక్‌ను రూపొందించింది. పాపులర్ స్టార్ వార్స్ బైక్స్‌ను తలపిస్తున్న ఈ బైక్‌ను... Read more
Sep 10 | పండుగల సీజన్లో కస్టమర్లు కొత్త కార్లు, బైక్‌లు, స్కూటర్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఈ ఏడాది పండుగల సీజన్లో భారతీయుల కొనుగోలుదారుల మనస్సు దోచేందుకు అన్ని కార్ల తయారీ సంస్థలు సిద్ధం అవుతున్నాయి.... Read more
Sep 06 | రోడ్డు మీద బుల్లెట్ బండి వెళ్తుంటే ఆ డుగ్గు డుగ్గు మనే శబ్ధం అందరినీ ఆకర్షిస్తుంది. అదే బుల్లెట్ బండి ఎలాంటి శబ్దం చేయకుండా నిశబ్దంగా పరుగులు తీస్తే అప్పుడెలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి.... Read more
Aug 24 | గురుగ్రామ్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కోరిట్ ఎలక్ట్రిక్ తాజాగా రెండు కొత్త తక్కువ-స్పీడ్ ఎలక్ట్రిక్ ఫ్యాట్ టైర్ బైక్‌లను విడుదల చేసింది. హోవర్ 2.0 అలాగే హోవర్ 2.0 + పేర్లతో విడుదలైన ఈ... Read more