అర్ధశతాబ్దిగా ఆ పేరు తెలుగునాట ఇంటింటి పేరు. సాహిత్య కళారంగాలలో ప్రజ్ఞ ప్రఖ్యాతి గాంచినవారు. కారం చమత్కారం మమకారం తగుపాళ్లలో పంచినవారు. ఆయన ఒక్కరు కాదు ఇద్దరు. తెలుగువారు బాపుని రమణని విడివిడిగా అభిమానించారు. అందమైన ద్వంద్వ సమాసంగా ఆ జంటని సమాదరించారు. బాపు-రమణల స్నేహరాసిక్యతకు నిండుమనసుతో నీరాజనాలెత్తారు. వారిద్దరుకారు ఒక్కరేనని తీర్మానించారు తెలుగువారు. బాపు అరవై అయిదేళ్ల చిత్రకారుడు, యాభై ఏళ్ల చలనచిత్రకారుడు. తెలుగు సంస్కృతికీ సంప్రదాయాలకు అందచందాలకు బాపు గీసిన తీసిన బొమ్మలు ప్రత్యక్ష సాక్ష్యాలు.
సత్తిరాజు లక్ష్మీనారాయణ (బాపు) ఈయన అసలు పేరు. తెలుగువాడే కాని, పుట్టింది ప.గో.జి. నరసాపురమే గాని పెరిగిందీ చదివిందీ యావత్తూ మద్రాసులోనే. తండ్రి వేణుగోపాలరావు వృత్తిరీత్యా లాయరు. లక్షింనారాయణ లాయర్ కావాలని తండ్రి ఆకాంక్ష. ‘బాపు’ తండ్రి పెట్టుకున్న ముద్దుపేరు. ఆయన నోటి వాక్యాన బాపు పేరు ఇంటింటి పేరు అయింది. ఖండాంతరాలలో కూడా యీ పేరు అభిమానులను సంపాయించుకుంది. ఆ తరువాత భాగ్యవతిని పెళ్లాడి ఓ ఇంటివారయ్యారు. అది పంధొమ్మిది వందల పిఫ్టీసిక్స్. పెళ్లికూతురు గోవిందరాజుల సుబ్బారావు గారి అమ్మాయి. కొన్నాళ్లు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో జర్నలిస్టుగా పనిచేశారు. బాపు గీత అన్ని భాషా పత్రికలలోనూ విరివిగా కనబడి తీరిక లేకుండా అందరినీ అలరించడం మొదలుపెట్టింది.
బాలానంద సంఘం నుంచి బాల పత్రికలోంచి బాపు బొమ్మల కథ మొదలైంది. తర్వాత సాధనమున పనులు సమకూరి, నూత్నయవ్వనదశలోనే కవర్ డిజైన్లు, కామిక్సూ, కార్టూన్లు వేయడం మొదలుపెట్టారు. 1955లో ఆంధ్రపత్రికలో పొలిటికల్ కార్టూనిస్ట్‌గా చోటు సంపాదించారు. ‘మనవాళ్లు’ శీర్షికన జేబు కార్టూన్లు, ‘గిరీశం’ పేరు మీద స్ట్రిప్ కార్టూన్లూ పేల్చారు. తెలుగునాట యిలాంటి శీర్షికలకు మంచి ప్రాచుర్యం వచ్చింది. వీటికో ఛందస్సు, వ్యాకరణం, అలంకారం కూర్చింది మనవాళ్లేనని చెప్పడానికి, చెప్పుకోవడానికి మనం వెనకాడక్కరలేదు. అరవైలో రమణ సినిమారంగ ప్రవేశం చేశారు.
బాపు అప్పుడప్పుడు సరదాగా సినిమాలకు పబ్లిసిటీ చిత్రచిత్రంగా చేస్తుండేవారు. బాపు ఫ్రీస్టయిల్ అక్షరాలు వెల్లువగా వచ్చేశాయి. గుండ్రంగా రాయడానికి మనమెందుకు, పోత అక్షరాలను కంపోజ్ చేసుకోవచ్చు కదా అంటూ విప్లవించాడు బాపు. ఇంక అంతే! పుస్తకాల నిండా పత్రికలలో శీర్షికలు, సినిమా పోస్టర్లలో, సైన్ బోర్డులూ అన్నిటా బాపు చేరాతలు నిండిపోయాయి. ప్రింటింగ్ ప్రెస్‌ల వారు గిరాకీని గమనించి బాపు అక్షరాల్ని పోతలు పోయించారు. డెస్క్‌టాప్ ప్రింటింగ్ వచ్చాక రకరకాల బాపు వొరవళ్లని సాప్ట్‌వేర్‌గా రూపొందించేశారు. ఇప్పుడు బాపు బ్రష్, బాపు నిబ్ లాంటి రకరకాలు. అక్షర చరిత్రలో లిపి పరంగా ఒక నూతన అధ్యాయాన్ని సృజించిన బాపు అ-క్షరం. ‘జ్యోతి ’
1967లో ‘సాక్షి ’గా కావ్యరూపం దాల్చింది. బాపు చిత్రకారుడే కాదు గొప్ప చిత్ర దర్శకుడన్నారు. చాలా తక్కువ ఖర్చుతో అంటే రెండున్నర లక్షల్లో సాక్షి చిత్రం పూర్తయింది. డెరైక్టర్తోబాటు నటీనటులు, సాంకేతిక వర్గానికి మంచి పేరు తెచ్చింది. తాష్కెంటు ఫిలిం ఫెస్టివల్‌కి ఎంపిక అయింది. సినీజనులు బాపుని తొలి చిత్రంతోనే అభిమానించారు.
శ్రీరామరాజ్యం, భాగవత కథలు సీరియల్‌కీ బాపు గీసిన, గీసుకున్న బొమ్మల గురించి ప్రస్తావించడం బాపుకి ఇష్టం ఉండదు ‘అదేమీ విశేషం కాదు, అది కేవలం నా వీలుకోసం నేను చేసుకునే ఏర్పాటు. అదీ కాస్తో కూస్తో గీతలు వచ్చు కాబట్టి ’’ అంటారు. ఈ సందర్భంలో బాపు శ్రద్ధకి, ఓపికకి ఎవరైనా నమస్కరించాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Feb 20 | పరిచయం : తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రవేసుకుని అద్భుతమైన హాస్యాస్పద చిత్రంగా చరిత్రలోనే నిలిచిపోయింది ‘‘మిస్సమ్మ’’. ఈ చిత్రం 1995వ సంవత్సరంలో విడుదలైంది. ఈ సినిమాలో తెలుగు చిత్రపరిశ్రమలోనే మహాదిగ్గజాలైన నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు,... Read more
Feb 19 | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గర్వించదగిన సినిమా ‘‘మాయాబజార్’’. ఈ చిత్రం 1957లో మార్చి 7వ తేదీన ఆంధ్రదేశమంతటా విడదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. 2007వ సంవత్సరం నాటికి ఈ సినిమా 50 ఏళ్లు పూర్తి... Read more
Jan 18 | నవరస నటనా సార్వభౌమునిగా పేరుగాంచిన స్వర్గీయ నందమూరి తారకరామారావు 1923 మే 28న క్రిష్ణా జిల్లాలోని గుడివాడ తాలూకాకు చెందిన నిమ్మకూరులో అతి పేద కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుండే సంగీతం పై మక్కువ... Read more
Dec 02 | ఆయన పాట వింటే తనువు పులకించిపోవాల్సిందే. మధురగాయకుడు మహమ్మద్ రఫీ తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో పాడారు. ఆయన తొలిసారిగా నాగయ్య నటించి, స్వీయదర్శకత్వంలో నిర్మించిన 'భక్త రామదాసు' చిత్రంలో పాడారు. అయితే ఆ... Read more
Jul 16 | టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో బడా నిర్మాత బండ్ల గణేష్ నిర్మాతగా కాజల్ హీరోయిన్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా... Read more