తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గర్వించదగిన సినిమా ‘‘మాయాబజార్’’. ఈ చిత్రం 1957లో మార్చి 7వ తేదీన ఆంధ్రదేశమంతటా విడదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. 2007వ సంవత్సరం నాటికి ఈ సినిమా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక వార్తాపత్రికలు, వివిధ టెలివిజన ప్రసారాలు ప్రత్యేకమైన వ్యాసాలను అందించాయి. చరిత్రలోనే తనదైన ముద్రవేసుకుని తెలుగు చిత్రసీమకు ప్రతీకగా నిలిచిపోయింది ఈ మాయాబజార్. బహుశా అద్భుతం అనే మాట ఈ సినిమా ద్వారానే ప్రచారంలోకి వచ్చిందేమో అనిపిస్తుంది. ఎన్నో జనరంజక చిత్రాలను అందించిన విజయా సంస్థ తెలుగు అభిమానులందరికీ అందించిన మరో కళాఖండమే ఈ చిత్రం. భక్త పోతన, యోగి వేమన, గుణసుందరి కథ, పాతాళ భైరవి, దొంగరాముడు వంటి అపురూపమైన చిత్రాలను తెరకెక్కించిన కేవీరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
మొదట ఈ చిత్రం కథతో 1936వ సంవత్సరంలో శశిరేఖా పరిణయం అనే ఒక చిత్రం రూపొందించబడింది. ఆ చిత్రానికి మరొక పేరు మాయాబజార్. అదే పేరునే ఈ చిత్రానికి కూడా పెట్టడం జరిగింది. ఇక కథ విషయానికి వస్తే... మహాభారతంలోని కొన్ని పాత్రలను తీసుకొని ఒక కల్పిత చిత్రాన్ని చిత్రీకరించారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక చిత్రా కథావస్తువు. ఈ చిత్రంలో దుర్యోధనుని కుమారుడైన లక్ష్మణ కుమారుడు (మహాభారతంలో ఇతడు పుట్టలేదు) వివాహం శశిరేఖతో కుదురుతుంది. కానీ ఘటోత్కచుడు తన ఆశ్రమంలోని అభిమన్యుడితో ఈమె వివాహం జరిపించడం కోసం శశిరేఖను అపహరిస్తాడు. ఆ తరువాత ఘటోత్కచుడే మాయా శశిరేఖా అవతారం దాల్చి కౌరవులను ముప్పతిప్పలు పెడతాడు. ఇవి ఈ చిత్రంలోని ముఖ్య ఘట్టాలు.
సంగీత, సాహిత్యాల విషయానికి వస్తే, పింగళి నాగేంద్రరావు రచించిన మాటలు, పాటలు ఒక మహాఅద్భుతమనే చెప్పాలి. ఈయన తన పాటలలో కొత్త పదాల్ని కూడా మనకు పరిచయం చేశాడు. మాటలు లేని చోటుల్లో కెమెరా మరింత అద్భుతంగా పని చేస్తుంది. ఉదాహరణకు చిన్న పిల్లగా ఆడుకుంటున్న శశిరేఖ.. ఉద్యానవనంలో ఒక కొలని గట్టున అలవోకగా కూర్చుంటుంది. కెమెరా ఆమె మొహమ్మీదనుంచి మెల్లగా పాన్ అయి కొలనులోని తామరమొగ్గను చూపిస్తుంది. గడచి పోతున్న కాలానికి గుర్తుగా కొలనులో అలలు రేగడమూ, ఆ మొగ్గ మెల్లగా విచ్చుకోవడమూ, ఆ తర్వాత కెమెరా మెల్లగా వెనక్కి తిరిగి శశిరేఖ మొహాన్ని చూపడమూ జరుగుతాయి. ఇప్పుడక్కడ నవయవ్వనవతి యైన శశిరేఖ అంటే సావిత్రి ఉంటుంది!
ఇక స్క్రిప్టు మనల్ని తల తిప్పుకోనీయకుండా చేస్తే మార్కస్ బార్ట్లే ఛాయాగ్రహణం, హర్బన్స్ సింగ్ స్పెషల్ ఎఫెక్ట్లూ మనల్ని రెప్ప వాల్చనీయకుండా చేస్తాయి. ఈ చిత్రానిది ప్రపంచ సినిమా చరిత్రలోనే అత్యుత్తమమైన స్క్రీన్ ప్లే అని గుమ్మడి వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. "లాహిరి లాహిరి లాహిరిలో" పాటను చూసి తెలుగు సినిమా చరిత్ర లోనే వెన్నెలనింత అందంగా ఇంకెక్కడా చూడలేదు' అనుకున్న వారు ఆ పాటను మండుటెండలో తీశారని తెలుసుకుని తెల్లబోయారు. ఇక స్పెషల్ ఎఫెక్టులా లెక్కపెట్టలేనన్ని.
అప్పట్లో నలుపు తెలుపులో ఉన్న ఈ చిత్రాన్ని గోల్డ్‌స్టోన్ అనే ఒక సంస్థ 2010 జనవరి 30 న రంగుల్లో విడుదల చేశారు. మాయాబజార్ పాత సినిమాలో సౌండ్ ట్రాక్‌లన్నీ పూర్తిగా అరిగిపోవడంతో వినసొంపుగా లేవు. అందుకని మూలం చెడకుండా నేపథ్య సంగీతం మొత్తం రీరికార్డింగ్ చేశారు. దాని తర్వాత సినిమాను 70 ఎం.ఎం కి మార్చి డీటీఎస్ కి మార్చారు. ఇందుకోసం 165 మంది నిపుణులు దాదాపు ఏడాది సమయం పాటు పనిచేశారు. ఇది ఈ సినిమాకు సంబంధించిన విశేషాలు.
(And get your daily news straight to your inbox)
Feb 20 | పరిచయం : తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రవేసుకుని అద్భుతమైన హాస్యాస్పద చిత్రంగా చరిత్రలోనే నిలిచిపోయింది ‘‘మిస్సమ్మ’’. ఈ చిత్రం 1995వ సంవత్సరంలో విడుదలైంది. ఈ సినిమాలో తెలుగు చిత్రపరిశ్రమలోనే మహాదిగ్గజాలైన నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు,... Read more
Jan 18 | నవరస నటనా సార్వభౌమునిగా పేరుగాంచిన స్వర్గీయ నందమూరి తారకరామారావు 1923 మే 28న క్రిష్ణా జిల్లాలోని గుడివాడ తాలూకాకు చెందిన నిమ్మకూరులో అతి పేద కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుండే సంగీతం పై మక్కువ... Read more
Dec 18 | అర్ధశతాబ్దిగా ఆ పేరు తెలుగునాట ఇంటింటి పేరు. సాహిత్య కళారంగాలలో ప్రజ్ఞ ప్రఖ్యాతి గాంచినవారు. కారం చమత్కారం మమకారం తగుపాళ్లలో పంచినవారు. ఆయన ఒక్కరు కాదు ఇద్దరు. తెలుగువారు బాపుని రమణని విడివిడిగా అభిమానించారు.... Read more
Dec 02 | ఆయన పాట వింటే తనువు పులకించిపోవాల్సిందే. మధురగాయకుడు మహమ్మద్ రఫీ తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో పాడారు. ఆయన తొలిసారిగా నాగయ్య నటించి, స్వీయదర్శకత్వంలో నిర్మించిన 'భక్త రామదాసు' చిత్రంలో పాడారు. అయితే ఆ... Read more
Jul 16 | టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో బడా నిర్మాత బండ్ల గణేష్ నిర్మాతగా కాజల్ హీరోయిన్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా... Read more