పరిచయం : తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రవేసుకుని అద్భుతమైన హాస్యాస్పద చిత్రంగా చరిత్రలోనే నిలిచిపోయింది ‘‘మిస్సమ్మ’’. ఈ చిత్రం 1995వ సంవత్సరంలో విడుదలైంది. ఈ సినిమాలో తెలుగు చిత్రపరిశ్రమలోనే మహాదిగ్గజాలైన నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, తెలుగు జాతికే గర్వించదగ్గ నటుడు నందమూరి తారకరామరావులు నటించారు. వీరిద్దరు వున్నప్పటికీ ఈ సినిమాలో ముఖ్యపాత్రను పోషించింది మాత్రం సావిత్రి. అంతేకాకుండా ఈ సినిమాలో ఎస్వీ రంగారావు, జమున, రేలంగి వెంకటరామయ్య, అల్లు రామలింగయ్య, రమణారెడ్డి, బాలకృష్ణ, దొరైస్వామి వంటి ఎంతోమంది నటులు నటించారు. నటి సావిత్రి ఈ చిత్రంలో తన నటనతో అందరినీ ఆకర్షించడమే గాక.. చక్కని అభినేత్రిగా పేరు తెచ్చుకుంది. యొతిష్ బెనర్ఝీ అనే బెంగాలీ రచయిత రచించిన ‘‘మన్మోయీ గర్ల్స్ స్కూల్’’ అనే హాస్య రచన ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు చక్రపాణి, పింగళి నాగేంద్రరావులు కలం పట్టగా.. ఎల్వీ ప్రసాద్ తన దర్శకత్వంతో ఎంతో వినోదాత్మకంగా రూపొందించారు. ఇక పాటలు, మాటల విషయానికొస్తే.. రచయితగా పింగళి నాగేంద్రరావు అద్భుతమైన పాటలను రూపొందించారు. ఈ పాటలు ఈనాటికీ మన తెలుగువారిని అలరిస్తూనే వున్నాయి.
సినిమా కథ : ఈ సినిమాలోని కథ.. నిజ జీవింతంలోనే జరిగివుండదు కదా.. ఊహించలేనిది కూడా. అయినా చక్రపానిగారు తన సామర్థ్యంతో ఈ సినిమా కథాంశాన్ని ఎంతో అద్భుతంగా రచించి, చరిత్రలోనే నిలిచిపోయేటట్లు చేశారు. అంతేకాకుండా ఈ చిత్రానికి విచత్రంగా ప్రచారాలు కూడా చేశారు.
మిస్ మేరీ పాత్రలో నటించిన సావిత్రి, తనకు సరిగ్గా పరిచయం కూడా కాని ఒక అబ్బాయి ఎమ్టీరావుకి భార్యగా నటించడానికి సిద్ధపడుతుంది. కానీ వీరిద్దరు ఇలా నటించడానికి కారణాలేంటి..? అసలు మేరీ ఎవరు..? వీరిద్దరు ఎలా పరిచయమవుతారు..? సావిత్రికి ఎన్టీ రామారావు భార్యగా ఎందుకు నటిస్తుంది..? ఇవన్నీ తెలియాలంటే మనం స్టోరీలోకి వెళ్లాల్సిందే..
వాళ్ళిద్దరూ ఎంత గడుసు వాళ్ళో ప్రేక్షకులకు అంతకు ముందే తెలిసి పోతుంది. కూటికోసం కోటి విద్యలు ప్రదర్శించగలిగే దేవయ్యను 'ప్రభుత్వం భిక్షాటనను నిషేధించిందని' భయపెట్టి ఎమ్టీరావు తమ వెంట తీసుకెళతాడు. అక్కడ నాయుడు తప్పిపోయిన తన పెద్ద కూతురు మహాలక్ష్మి పేరుతో ఒక బడిని నడుపుతుంటాడు. ఆ బడికి సెక్రటరీగానే గాక అందులోనే మాస్టారుగా వెలగబెడుతున్న నాయుడి మేనల్లుడు రాజు ఊళ్ళో ఎవరిదో బర్రె తప్పిపోయిందని వింటాడు. తానో పెద్ద డిటెక్టివ్ ననే భ్రమతో బళ్ళో పిల్లల్ని గాలికొదిలేసి, బర్రెను వెదుకుతూ తనూ గాలికి తిరుగుతూ ఉంటాడు. అదే బళ్ళోని ఇంకో ఉపాధ్యాయుడు పిల్లల్ని శిక్షించడమూ, వాళ్ళచేత ఆయుర్వేద మందులు నూరించడమూ మాత్రమే తెలిసినవాడు. వాళ్ళిద్దరూ కలిసి స్కూలును ఎక్కడ ముంచేస్తారని కంగారు పడి నాయుడు భార్యా భర్తలైన ఇద్దరు గ్రాడ్యుయేట్లు కావాలని పేపర్లో ప్రకటించి, మారు పేర్లతో వచ్చిన వీళ్ళిద్దరినీ వాళ్ళిద్దరి స్థానాల్లో చేర్చుకుంటాడు.
తప్పిపోయిన మహాలక్ష్మే మేరీ యేమోననే అనుమానం ఆ 'డిటెక్టివ్' రాజుది. ఇంకోవైపు వీళ్ళిద్దరూ ఊళ్ళో దిగ్గానే నాయుడు 'కూతురూ-అల్లుడూ' అని వరసలు కలిపేస్తాడు. ఈ వరసలు మేరీకి నచ్చక చిరచిరలాడుతూ, తన కోపాన్నంతా ఎమ్టీరావు మీద చూపిస్తూంటుంది. గట్టిగా దెబ్బలాడడానికి ఆమెకు కూడా భయమే. ఇంటిదగ్గర ఆమె చదువు కోసం చేసిన అప్పు కొండలా పెరిగి పోయింది. అప్పిచ్చిన డేవిడ్ "బాకీ తీర్చొద్దు నన్ను పెళ్ళి చేసుకో" అని వేధిస్తుంటాడు. వాడి బాకీ వాడి మొహాన కొట్టి, అటు వాడితోనూ, ఇటు ఎమ్టీరావుతోనూ ఒకేసారి తెగతెంపులు చేసుకునే ఉద్దేశంతో ఉన్నట్టు కనబడుతుంది.
అయితే నాయుడి చిన్న కూతురు ఎమ్టీరావుతో చనువుగా ఉంటుంది. కానీ ఆ పిల్లను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న రాజుకు ఇది సహజంగానే నచ్చదు. ఒకసారి మేరీ తాము నిజంగా దంపతులం కామనే నిజాన్ని బయట పెట్టబోయే సరికి ఎమ్టీరావు కంగారు పడి ఆమెకు కిరస్తానీ దయ్యం పట్టిందని అంటాడు. అప్పుడు ఆ దయ్యాన్ని బెదిరించడానికి అన్నట్టుగా నాయుడు "నువ్వు కాకపోతే మ అల్లుడికి (ఎమ్టీరావుకి) పిల్లే దొరకదనుకున్నవా? మా పిల్లనే ఇచ్చి చేస్తాం." అంటాడు. ఈ విషయం దేవయ్య ద్వారా విన్న రాజు కంగారు పడి తర్వాత మెల్లగా ధైర్యం చేసి, మేరీని కలిసి, ఎమ్టీరావుకు బదులుగా తనే తన మరదలికి సంగీత పాఠాలు నేర్పడానికి వీలుగా ఆమె సలహా మీదే ఆమె దగ్గర సంగీతం నేర్చుకోబోతాడు.ఈ సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుంది.
తప్పిపోయిన మహాలక్ష్మే మిస్ మేరీ యేమోననే అనుమానం తీర్చుకోవడానికి ఒక నాటి అర్ధరాత్రి తన అసిస్టెంటుతో సహా మేరీ వాళ్ళుంటున్న ఇంటికెళ్ళి, ఆమె పడక మీదికి టార్చ్ లైటు వేసి చూస్తాడు రాజు. ఆ వెలుతురుకు మేరీకి మెళకువ రావడం, డిటెక్టివులు పారిపోవడంతో అంతా గందరగోళమవుతుంది. అనుకోని ఈ సంఘటనతో కలవరపడిన మేరీకి కలత నిద్ర పడుతుంది. ఆ కలతనిద్రలో ఒక పీడకల.. ఆ పీడకలలో తనను బలవంతంగా పెళ్ళి చేసుకోబోయిన దుర్మార్గుడిగా డేవిడ్, అతడి బారి నుంచి తనను కాపాడిన వీరుడిగా ఎమ్టీరావు కనిపిస్తారు. దాంతో ఆమెకు ఎమ్టీరావు మీద అనురాగం అంకురిస్తుంది. కథ తిరగవలసిన మలుపులన్నీ తిరిగి సుఖాంతమవుతుంది.
చివరగా : మొదట్లో ఈ సినిమాలో మేరీ పాత్రకోసం భానుమతిని తీసుకున్నట్లుగా సమాచారం. అంతేకాకుండా ఆమెతో కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం షూటింగ్ నిలిపివేసి.. తర్వాత సావిత్రిని తీసుకొని రూపొందించినట్లు చెబుతున్నారు. ఈ సినిమాను హిందీలో కూడా తెరకెక్కించారు. అందులో మీనాకుమారి మేరీ పాత్రను పోషించింది.
(And get your daily news straight to your inbox)
Feb 19 | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గర్వించదగిన సినిమా ‘‘మాయాబజార్’’. ఈ చిత్రం 1957లో మార్చి 7వ తేదీన ఆంధ్రదేశమంతటా విడదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. 2007వ సంవత్సరం నాటికి ఈ సినిమా 50 ఏళ్లు పూర్తి... Read more
Jan 18 | నవరస నటనా సార్వభౌమునిగా పేరుగాంచిన స్వర్గీయ నందమూరి తారకరామారావు 1923 మే 28న క్రిష్ణా జిల్లాలోని గుడివాడ తాలూకాకు చెందిన నిమ్మకూరులో అతి పేద కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుండే సంగీతం పై మక్కువ... Read more
Dec 18 | అర్ధశతాబ్దిగా ఆ పేరు తెలుగునాట ఇంటింటి పేరు. సాహిత్య కళారంగాలలో ప్రజ్ఞ ప్రఖ్యాతి గాంచినవారు. కారం చమత్కారం మమకారం తగుపాళ్లలో పంచినవారు. ఆయన ఒక్కరు కాదు ఇద్దరు. తెలుగువారు బాపుని రమణని విడివిడిగా అభిమానించారు.... Read more
Dec 02 | ఆయన పాట వింటే తనువు పులకించిపోవాల్సిందే. మధురగాయకుడు మహమ్మద్ రఫీ తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో పాడారు. ఆయన తొలిసారిగా నాగయ్య నటించి, స్వీయదర్శకత్వంలో నిర్మించిన 'భక్త రామదాసు' చిత్రంలో పాడారు. అయితే ఆ... Read more
Jul 16 | టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో బడా నిర్మాత బండ్ల గణేష్ నిర్మాతగా కాజల్ హీరోయిన్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా... Read more