నవరస నటనా సార్వభౌమునిగా పేరుగాంచిన స్వర్గీయ నందమూరి తారకరామారావు 1923 మే 28న క్రిష్ణా జిల్లాలోని గుడివాడ తాలూకాకు చెందిన నిమ్మకూరులో అతి పేద కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుండే సంగీతం పై మక్కువ పెంచుకున్నారు. 1940లో మెట్రిక్యులేషన్ పాసయిన అనంతరం విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కళాశాలో ఇంటర్మీడియట్ లో చేరారు. చదువుతున్న రోజుల్లోనే రామారావు ఇంటి భాధ్యతలను నెరవేర్చేందుకు విజయవాడలోని హోటళ్లకు సైకిల్ మీద వెళ్లి పాలను సరఫరా చేసేవారు. అనంతం చిన్న దుకాణంలో క్లర్కుగా పనిచేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చివరిలో కాలేజీ విద్యార్థులంతా కలిసి విశ్వనాథ సత్యన్నారాయణ రచించిన డ్రామాను ప్రదర్శించాలనుకున్నారు.
దీనిలో ఎన్ టిఆర్ స్ర్తీ పాత్రను పోషించారు. ఇదే అతని మొదటి నాటకరంగ అనుభవంగా చెబుతుంటారు. 1945వ సంవత్సరంలో ఎన్ టిఆర్ గుంటూరులోని ఆంధ్రా క్రిష్టియన్ కాలేజీలో బిఎలో చేరారు. ఈ సమయంలోనే రామారావు చేసినపాపం అనే నాటకాన్ని వేశారు. ఈ ప్రదర్శనలో ప్రముఖ నటుడు స్వర్గీయ కొంగర జగ్గయ్య, కెవిఎస్ శర్మ, తదితరులు కూడా నటించారు. డిగ్రీ పూర్తయిన తరువాత రామారావు మద్రాసు సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి విజయం సాధించి మంగళగిరిలో సబ్ రిజిష్ర్టార్ గా చేరారు. నటనారంగంలో దిగిన తరువాత తన ఉద్యోగాన్ని వదిలి వేశారు. ఎన్ టిఆర్ మొదట 1949లో మనదేశం సినిమాలో ఇన్ స్పెక్టర్ పాత్ర పోషించారు. రామారావుకు ఈ అవకాశాన్ని దర్శకులు ఎల్ వి ప్రసాద్ ఇచ్చారు. అనంతరం బిఎ సుబ్బారావు దర్శకత్వంలో పల్లెటూరి పిల్ల సినిమాలో నటించారు. ఈ సినిమాలోనే అక్కినేని నాగేశ్వర రావు, అంజలి దేవిలో పాటు నటించారు.
ఆ కాలంలో ఈ సినిమా 100 రోజులు ఆడి, కమర్షియల్ గా విజయం సాధించింది. తరువత కెవి రెడ్డి దర్శకత్వంలో పాతాళభైరవిలో రామారావు నటించడంతో అతనికి ఆ సినిమా పెద్ద బ్రేక్ నిచ్చింది. ఈ సినిమాలో రామారావు రాజు పాత్రతను పోషించారు. 1957లో మాయాబజార్ లో నటించి తన నటనతో ఎందరినో మెప్పించారు. అనంతరం క్రిష్ణునిగా 17 చిత్రాల్లో నటించి ఆ పాత్రకు ప్రాణం పోశారు. 1952లో కర్నన్ అనే తమిళ చిత్రంలో నటించి అక్కడ కూడా అభిమానులను సొంతం చేసుకున్నారు. తరువాతి కాలంలో దానవీర శూరకర్ణ, లవకుశ, శ్రీరామాంజనేయ యుధ్దం, శ్రీరామ పట్టాభిషేకం తదితర పౌరాణిక సినిమాల్లో నటించారు.
భూకైలాస్ చిత్రంలో రావణాసురి పాత్రను ధరించి ప్రేక్షకుల మెప్పు పొందిన ఘనత రామారావుకు దక్కింది. రాముడు, రావణుడు, భీముడు, శివుడు, అర్జునుడు, కర్ణుడు , ధుర్యోధనుడు తదితర పాత్రలకు ప్రాణం పోసిన నటునిగా పేరుతెచ్చుకున్నారు. అనంతం అనేక సాంఘిక చిత్రాలలో హీరోగా , సోదరునిగా మెప్పించారు. 1963లో వచ్చిన లవకుశ రామారావుకు ఎంతో పేరును తెచ్చిపెట్టింది. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన అనంతర కూడా ఎన్ టిఆర్ నటనకు ఫుల్ స్టాప్ పెట్టలేదు. బ్రహ్మర్షి విశ్వామిత్ర, మేజర్ చంద్రకాంత్ తదితర సినిమాలలో నటించారు. 44 ఏళ్లపాటు సినీ రంగాన్ని ఏలిన ఆయన మొత్తం 320 సినిమాల్లో నటించారు. రామారావు మూడు నేషనల్ అవార్డులతో పాటు ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు. రామారావు సినీరంగ సేవలకు గుర్తింపుగా ఎన్ టిఆర్ నేషనల్ అవార్డును 1966లో ప్రకటించారు.
రాజకీయ దురంధరుడు
నందమూరి తారక రామారావు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించడం ఒక చారిత్రక ఘట్టంగా మిగులు తుంది. 1983లో జరిగిన ఎన్నికల్లోతెలు గుడేశం పార్టీ అఖండ విజయం సాధించింది. అధికారంలోకి వచ్చిన అనంతరం రామాావు అనేక ప్రజా సంక్షేమ పథకాలు చేప్పట్టి ప్రజల మెప్పు పొందారు. తెలు గువాడి ఆత్మస్థయిర్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా వినిపంచడంలో బేష్ అనిపించుకున్నారు. . విజయవంతంగా ఐదేళ్ల పాలనను పూర్తి చేసుకున్నారు. అయితే 1989 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య రీతిలో తెలుగుదేశం ఓటమి పాలై తిగిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
అయితే 1994లో జ రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ తో పొత్తు పెట్టుకుని తిరిగి అధికారం చేజిక్కించుకుంది. అయితే 1995లో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్ టిరామారావు ను అవిశ్వాస తీర్మానంతో పదవి నుండి తొలగించి అతనే అధికార భాధ్యతలు చేపట్టారు. 1996 జనవరి 18న ఉదయం గుండెపోటుతో నందమూరి తారక రామారావు కన్నుమూశారు. అప్పుడు అతని వయసు 72 సంవత్సరాలు.
(And get your daily news straight to your inbox)
Feb 20 | పరిచయం : తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రవేసుకుని అద్భుతమైన హాస్యాస్పద చిత్రంగా చరిత్రలోనే నిలిచిపోయింది ‘‘మిస్సమ్మ’’. ఈ చిత్రం 1995వ సంవత్సరంలో విడుదలైంది. ఈ సినిమాలో తెలుగు చిత్రపరిశ్రమలోనే మహాదిగ్గజాలైన నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు,... Read more
Feb 19 | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గర్వించదగిన సినిమా ‘‘మాయాబజార్’’. ఈ చిత్రం 1957లో మార్చి 7వ తేదీన ఆంధ్రదేశమంతటా విడదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. 2007వ సంవత్సరం నాటికి ఈ సినిమా 50 ఏళ్లు పూర్తి... Read more
Dec 18 | అర్ధశతాబ్దిగా ఆ పేరు తెలుగునాట ఇంటింటి పేరు. సాహిత్య కళారంగాలలో ప్రజ్ఞ ప్రఖ్యాతి గాంచినవారు. కారం చమత్కారం మమకారం తగుపాళ్లలో పంచినవారు. ఆయన ఒక్కరు కాదు ఇద్దరు. తెలుగువారు బాపుని రమణని విడివిడిగా అభిమానించారు.... Read more
Dec 02 | ఆయన పాట వింటే తనువు పులకించిపోవాల్సిందే. మధురగాయకుడు మహమ్మద్ రఫీ తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో పాడారు. ఆయన తొలిసారిగా నాగయ్య నటించి, స్వీయదర్శకత్వంలో నిర్మించిన 'భక్త రామదాసు' చిత్రంలో పాడారు. అయితే ఆ... Read more
Jul 16 | టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో బడా నిర్మాత బండ్ల గణేష్ నిర్మాతగా కాజల్ హీరోయిన్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా... Read more