ఆయన పాట వింటే తనువు పులకించిపోవాల్సిందే. మధురగాయకుడు మహమ్మద్ రఫీ తెలుగులో కూడా కొన్ని చిత్రాల్లో పాడారు. ఆయన తొలిసారిగా నాగయ్య నటించి, స్వీయదర్శకత్వంలో నిర్మించిన 'భక్త రామదాసు' చిత్రంలో పాడారు. అయితే ఆ సినిమాలో ఆయన పాడినవి తెలుగు పాటలు కాదు. కబీర్దాసు కీర్తనల్ని హిందీలోనే పాడారు. నాగయ్య మీద గౌరవంతో రఫీ ఆనాటి మద్రాసుకి వచ్చి, పారితోషికం కూడా తీసుకోకుండా ఉచితంగా ఆ సినిమాలో విశేషం.
నాగయ్య అంటే అంత గౌరవం ఉండేది ఆనాటి ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు. ఇక రఫీ తెలుగులో పాడింది ఎన్టీఆర్ నటించిన 'భలే తమ్ముడు' చిత్రంలో. 'ఎంతవారు కాని వేదాంతులైనగాని వాలుచూపు సోకగానే తేలిపోదురోయ్' పాటతో ప్రారంభించి ఈ సినిమాలోని అన్ని పాటలనూ రఫీ పాడటం ఒక విశేషం. అగ్రనటులు ఎన్టీఆర్, ఏయన్నార్కు ఘంటసాల తప్ప మరో గాయకుడెవరూ పాడని ఆ రోజుల్లో 'భలే తమ్ముడు' చిత్రనిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య ముంబాయి నుంచి రఫీని తీసుకువచ్చి పాడించడం సంచలనం సృష్టించింది.
ప్రతి రోజూ పాటల రికార్డింగ్స్తో ఎంతో బిజీగా ఉండేవారు రఫీ. పారితోషికం కూడా భారీ స్థాయిలో ఉండేది. అటువంటి వ్యక్తి పుండరీకాక్షయ్య అడగ్గానే మద్రాసు వచ్చి చిత్రంలోని ఆరు పాటలను నాలుగు రోజుల్లో పాడేశారు. 'భలే తమ్ముడు' చిత్రంలోని పాటలను సి.నారాయణరెడ్డి రాశారు. తన గీతాల్లోని భావాన్ని ఆయన రఫీకి ఉర్దులో ట్రాన్స్లేట్ చేసి చెప్పడంతో రఫీ పని మరింత సులువయింది. 'భలే తమ్ముడు' చిత్రం తరువాత మళ్లీ రఫీ తెలుగులో పాటలు పాడింది ఎన్టీఆర్ చిత్రంలోనే కావడం మరో విశేషం.
హిందీలో విజయవంతమైన 'గీత్' చిత్రం ఆధారంగా రూపుదిద్దుకున్న 'ఆరాధన' లో ఆయన అద్భుతమైన పాటలు పాడారు. 'నా మది నిన్ను పిలిచింది గానమై.. నా ప్రాణమై' అనే పాట ఈ సినిమాలో హైలైట్గా నిలిచింది. ఈ సినిమాకి కూడా అట్లూరి పుండరీకాక్షయ్యే నిర్మాత.
రఫీ తెలుగులో పాటలు పాడిన మూడో చిత్రం 'అక్చర్ సలీం అనార్కలి'. ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో సలీంగా నటించిన నందమూరి బాలకృష్ణకు తన స్వరాన్ని రఫీ అందించడం విశేషం. 'తారలెంతగా మెరిసినో చందురుని కోసం..' వంటి పాటలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నారు రఫీ. ప్రముఖ సంగీత దర్శకుడు సి.రామచంద్ర ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించడం మరో విశేషం.
(And get your daily news straight to your inbox)
Feb 20 | పరిచయం : తెలుగు చిత్రసీమలో తనదైన ముద్రవేసుకుని అద్భుతమైన హాస్యాస్పద చిత్రంగా చరిత్రలోనే నిలిచిపోయింది ‘‘మిస్సమ్మ’’. ఈ చిత్రం 1995వ సంవత్సరంలో విడుదలైంది. ఈ సినిమాలో తెలుగు చిత్రపరిశ్రమలోనే మహాదిగ్గజాలైన నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు,... Read more
Feb 19 | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో గర్వించదగిన సినిమా ‘‘మాయాబజార్’’. ఈ చిత్రం 1957లో మార్చి 7వ తేదీన ఆంధ్రదేశమంతటా విడదలై అద్భుతమైన విజయాన్ని సాధించింది. 2007వ సంవత్సరం నాటికి ఈ సినిమా 50 ఏళ్లు పూర్తి... Read more
Jan 18 | నవరస నటనా సార్వభౌమునిగా పేరుగాంచిన స్వర్గీయ నందమూరి తారకరామారావు 1923 మే 28న క్రిష్ణా జిల్లాలోని గుడివాడ తాలూకాకు చెందిన నిమ్మకూరులో అతి పేద కుటుంబంలో జన్మించారు. చిన్నప్పటి నుండే సంగీతం పై మక్కువ... Read more
Dec 18 | అర్ధశతాబ్దిగా ఆ పేరు తెలుగునాట ఇంటింటి పేరు. సాహిత్య కళారంగాలలో ప్రజ్ఞ ప్రఖ్యాతి గాంచినవారు. కారం చమత్కారం మమకారం తగుపాళ్లలో పంచినవారు. ఆయన ఒక్కరు కాదు ఇద్దరు. తెలుగువారు బాపుని రమణని విడివిడిగా అభిమానించారు.... Read more
Jul 16 | టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్ లో బడా నిర్మాత బండ్ల గణేష్ నిర్మాతగా కాజల్ హీరోయిన్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా... Read more