బెగ్గర్ : ‘‘బాబు.. పదిరూపాయలుంటే ధర్మం చేయండి నాయనా... వెళ్లి టీ తాగుతాను..’’
మనిషి : ‘‘టీ ఐదు రూపాయలకే వస్తుంది కదరా..?’’
బెగ్గర్ : ‘‘ఇంకొకటి నా లవర్ కి బాబు’’
మనిషి : ‘‘బెగ్గర్ కి లవరా?’’
బెగ్గర్ : ‘‘లవర్ వచ్చాకే బెగ్గర్ అయ్యాను బాబు’’
కానిస్టేబుల్ : ‘‘ఓరి వెధవా! నిన్ను పక్కింట్లో దొంగతనం చేసుకోమంటే... నా ఇంట్లోనే దొంగతనం చేస్తావా?’’ అంటూ కోపగించుకున్నాడు కానిస్టేబుల్.
దొంగోడు : ‘‘క్షమించండి సార్.. ఇది వట్టి ట్రయల్ మాత్రమే. పక్కింట్లో అయితే పట్టబడుతానేమోనని భయం’’ అని అంటాడు దొంగ.
నౌకరు : ‘‘మొన్నరాత్రి మీరు నా కలలోకొచ్చి వంద రూపాయలు ఇచ్చారండి’’ అంటుంది వినయంగా.
యజమాని : ‘‘దాందేముంది.. ఈనెల జీతంలో ఆ వంద రూపాయలు పట్టుకుంటానులే’’ అని చెబుతుంది.
(తెలివిగా) నౌకరు : ‘‘అలాగే.. నిన్న రాత్రి కలలో నేను మీకు రెండొందలు ఇచ్చారమ్మగారూ..’’
అపర్ణ : ‘‘నువ్వు అనవసరంగా మా వారు పనిచేసే ఆఫీస్ రిసెప్షనిస్ట్ మీద ఎందుకు అనుమానం పడుతున్నాడు’’ అని అడిగింది.
బిందు : ‘‘ఎందుకంటే.. నేను కూడా ఒకానొక కాలంలో అక్కడ పనిచేశాడు కాబట్టి’’ అని సమాధానం ఇచ్చింది.
వంశీ : నా భార్యను రెండో అంతస్తు నుంచి తోసేశాను. నన్ను జైల్లో పెట్టండి’’... అని మొరపెట్టుకున్నాడు.
పోలీస్ ఆఫీసర్ : ‘‘ఆమె చనిపోయిందా’’... అని అడిగాడు.
వంశీ : ‘‘లేదు. అందుకనే జైల్లో పెట్టమంటున్నాను’’ అని అన్నాడు.
"బాలా బాలా మా ఆయన ఊరెళ్లారు. రాత్రికి నేనొక్కదాన్ని పడుకోవాలంటే భయంగా ఉంది తోడొస్తావా?'' బతిమాలింది అనసూయ.
"మీ ఇంట్లో అందరికీ ఇంత భయమెందుకమ్మా? నీవు ఊరెళ్లినప్పుడు మీ ఆయన రమ్మంటాడు, ఆయన ఊరెళ్లినప్పుడు నీవు రమ్మంటావు ... బాగుంది మీ వరస'' ఈసడించింది ఎదురింటి బాలమణి.
‘‘ప్రతి రైలూ లేటుగా వస్తే ఈ పనికిమాలిన టైం టేబుల్ ఇక్కడెందుకు? ’’ రైల్వే అధికారితో పేచి పెట్టుకున్నాడు రామలింగం.
‘‘ప్రతి రైలూ కరెక్టు టైంకు వస్తే నీకు విశ్రాంతి తీసుకుంటున్న ఈ వెయింటింగ్ రూంలు ఎందుకు?’’ మరింతగా మిర్రిచూస్తూ అన్నాడు రైల్వే అధికారి.