Telugu Jokes
వంశ పారంపర్యం

"వెంకయ్యగారూ... ఈ జబ్బు మీతో రాలేదు. వంశపారంపర్యంగా వచ్చింది. ఆపరేషన్ చేస్తే పోతుంది" చెప్పాడు డాక్టర్.

"అమ్మయ్య... బతికించారు. అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి" చెప్పాడు వెంకయ్య.

మా ఆవిడ ప్రేమ..

"రాత్రిపూట ఎంత లేటుగా వెళ్ళినా మా ఆవిడ ఏమీ అనదు.

పైగా వెళ్ళగానే వేడి వేడి కాఫీ ఇస్తుంది.

స్నానానికి వేడి నీళ్ళు తోడి పెడ్తుంది.

బట్టలు విప్పి నాకు స్వెటర్ వేస్తుంది..." చెబుతున్నాడు చింతామణి.

"అబ్బా... మీ ఆవిడకు నీ మీద చాలా ప్రేమన్న మాట" నోరు తెరుస్తూ అన్నాడు భూషణం.

"మరి అంత చలిలో అంట్లు తోమడం కష్టం కదా" - అసలు విషయం చెప్పాడు చింతామణి

సిగ్గులేదటయ్యా నీకు?

"సిగ్గులేదటయ్యా నీకు?

కూరలు తరుగుతుంటే వేలు తెగిందని సెలవు కావాలంటున్నావా?

ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా" అరిచాడు ఆఫీసర్.

"నిజం సార్.... నిజంగానే వేలు తెగింది" వినయంగా అనాడు రంగారావు

"చాల్చాల్లే నోర్ముయ్.... గత పాతిక సంవత్సరాలుగా కూరలు తరుగుతునాను.

ఒక్కసారి కూడా నాకు కనీసం గోరు కూడా తెగలేదు.

అండర్ స్టాండ్" ఇంకా పెద్దగా అరిచాడు ఆఫీసర్.

మీ అమ్మ అరవాలి

"నాన్నా కాకి అరిస్తే చుట్టాలొస్తారా?" అడిగింది కూతురు

"అవును బేబీ" సమాధానిమిచ్చాడు తండ్రి.

"మరి వాళ్ళు పోవాలంటే?" అడిగింది కూతురు

"మీ అమ్మ అరవాలి " అన్నాడు తండ్రి.

ఎంతోయ్ ఒక్కో అరటిపండు?

"ఎంతోయ్ ఒక్కో అరటిపండు?" అడిగాడు శివకోటి పండ్లు అమ్మేకుర్రాడిని.

"ఒక్కోటి రూపాయి సార్" చెప్పాడతను.

"ముప్పావలాకిస్తావా?"

"ముప్పావలాకు తొక్కవస్తుంది."

"సరే.... అయితే ఈ పావలా తీసుకుని తొక్క నువ్వుంచుకుని పండు నాకివ్వు" అన్నాడు శివకోటి.