దారిన వెళ్తున్న ఒక అబ్బాయి నడుచుకుంటూ వెళ్తూ బస్ స్టాప్ లో వున్న అమ్మాయిని చూస్తాడు.
రోజూ ఆమెను ఫాలో చేస్తూ విపరీతంగా ప్రేమించేస్తాడు.
ఎలాగైనా తననే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు.
ఒకరోజు ఆ అబ్బాయి ఆ అమ్మాయి వాళ్ల నాన్న దగ్గరకు వెళ్లి తన పెళ్లి ప్రస్తావన గురించి వివరిస్తాడు.
అబ్బాయి : ‘‘చూడండి.. నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. మీరు గనుక తనను నాకిచ్చి పెళ్లి చేస్తే.. తను ఎంత బరువుంటుందో అన్ని కిలోల బంగారాన్ని మీకిస్తాను’’
ఈ మాటలు వినగానే అమ్మాయివాళ్ల నాన్న దీర్ఘంగా ఆలోచనలో పడిపోతాడు.
అమ్మాయివాళ్ల నాన్న : ‘‘కానీ నాక్కొంచెం సమయం కావాలి’’
కొన్నిరోజుల తరువాత ఆ అబ్బాయి తిరిగి అమ్మాయివాళ్ల నాన్నతో కలుస్తాడు.
అబ్బాయి : ‘‘నేను పెళ్లి గురించి మాట్లాడటానికి వచ్చాను. మీరింకా ఏమైనా ఆలోచిస్తున్నారు. చెప్పండి’’
అమ్మాయివాళ్ల నాన్న : ‘‘లేదు... వేరే విషయాలు ఆలోచించడానికి ఏమీలేదు.. కానీ మా అమ్మాయి ఇంకొంచె బరువు పెరిగితే చాలు!’’
ఒకరోజు రాముడు తన స్నేహితుడైన భీముడితో కలిసి ఇలా అంటాడు..
రాముడు : ఛీ దీనెమ్మ బతుకు! ఇదేం నెంబర్ రా బాబు.. ఎప్పుడు ఫోన్ చేసినా... రాంగ్ నెంబర్ అంటున్నాడు...
భీముడు : మరయితే.. నెంబర్ డయల్ చేసే ముందు సరిచూసుకుంటే అయిపోతుంది కదా...
రాముడు : రైట్ నెంబర్ ఏది అని అడిగితే చెప్పడం లేదు..
ఒకరోజు మాష్టారు ఒక పిల్లాడికి ఒక ప్రశ్నకు సమాధానం చెప్పమని అడుగుతాడు.
మాష్టారు : సముద్రంలో జామచెట్టు వుంటే.. పళ్లు ఎలా తీసుకుంటావు?
స్టూడెంట్ : పక్షిలా మారి ఎగురుంటూ వెళ్లి తీసుకుంటా.
మాష్టారు : మనిషిని పక్షిగా నీ మామా మారుస్తాడా?
స్టూడెంట్ : మరి సముద్రంలో చెట్టు నీ అయ్య పెడతాడా బే!
మాష్టారుకు ఒక్కసారిగా షాక్!
ఒక ఇంటిపనిమనిషి పరిగెత్తుతూ వెళ్లి ఆ ఇంటి కోడలితో ఇలా అంటుంది....
‘‘అమ్మగారూ.. మీ అత్తగారిని బయట ఎవరో ముగ్గురు ఆడవాళ్లు కొడుతున్నారు.’’
అప్పుడు కోడలు, పనిమనిషి చటుక్కున బయటికి పరిగెత్తుకుంటూ వస్తారు.
కోడలు ఏమో కామ్ గా నిలబడి చూస్తుంటుంది.
పనిమనిషి : అమ్మగారూ! మీరు హెల్ప్ చేయడానికి వెళ్లరా?
కోడలు : లేదు.. దానికోసం ఆ ముగ్గురే సరిపోతారు.
‘‘ఇక్కడ పెళ్లికి సంబంధించిన అన్ని సరుకులు తక్కువ ధరలకే అమ్మబడును’’ అనే బోర్డును గిరీశం చూసి ఆగాడు.
‘‘నాలుగు రకాల పెళ్లికూతుళ్లను నాకు చూపించండి.. అందులో ఒకరు నచ్చితే ఆమెని కొంటాను’’ అని దుకాణం యజమానితో అన్నాడు గిరీశం.
ఒకనాడు ఒక అత్త తన ముగ్గురు అల్లుళ్లు తనను ఎంతగా అభిమానిస్తున్నారో తెలుసుకోవడానికి ఒక పన్నాగం పన్నుతుంది.
అందుకు ఆమె ఒక బావిలో దూకుతుంది. మొదటి అల్లుడు ఆమెను బయటికి తీసుకొస్తాడు. అప్పుడు అత్త తమ అభిమానాన్ని మెచ్చకొని ఒక కార్ కొనిస్తుంది.
రెండోరోజు కూడా అలాగే బావిలో దూకుతుంది. అది గమనించిన రెండవ అల్లుడు కూడా ఆమెను కాపాడుతాడు. దాంతో అతనికి ఒక మోటార్ సైకిల్ కొనిస్తుంది అత్తమ్మ.
మూడోరోజు కూడా అత్త అలాగే బావిలో దూకేస్తుంది. కానీ మూడవ అల్లుడు మాత్రం ఆమెను కాపాడడు. అత్త చనిపోతుంది. కానీ నాలుగవరోజు అతనికోసం ఒక మర్సిడీజ్ గిఫ్ట్ గా వస్తుంది...
ఎక్కడినుంచి వచ్చిందనుకుంటున్నారు.............
అతని మామాగారు ఇచ్చారు.
ఒక వ్యక్తి తన భార్యను, చిన్నబిడ్డను ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చాడు.
భార్య : ‘‘ఏవండి, పిల్లాడు డాయిపర్ తడి చేసేశాడు. కొంచెం మారుస్తారా ప్లీజ్’’!
భర్త : ‘‘నేనిప్పుడు పనిలో బిజీగా వున్నాను. కానీ నీకు మాటిస్తున్నాను.. ఇంకొకసారి ఖచ్చితంగా చేస్తాను’’!
కొద్దిసేపు తరువాత పిల్లాడు మరోసారి డాయిపర్ ని తడి చేసేస్తాడు.
భార్య : ‘‘ఏవండి, పిల్లాడు మళ్లీ డాయిపర్ ని తడిగా చేసేశాడు. మారుస్తారని మాటిచ్చారు. మార్చండి’’!
భర్త భార్యవైపు అమాయకంగా చూస్తూ.. ‘‘నేను మారుస్తానన్నది ఇంకొక డాయిపర్ ని కాదు. ఇంకొక పిల్లాడు పుట్టాక అప్పుడు మారుస్తానని చెప్పాను’’ అని అంటాడు.