ఒక రోజు ఒక మంత్రి ఇంటికి లేఖ వస్తుంది. అప్పుడు ఆ మంత్రి ఆ లేఖను ఓపెన్ చేసి చూస్తే.. అందులో కేవలం ‘‘మూర్ఖుడు’’ అని రాసి వుంది. అది చూసి మంత్రి చాలా బాధపడ్డాడు.
తరువాతి రోజు పత్రకారులు న్యూస్ విభాగంలో ఆ మంత్రితో ఇలా అడిగారు... ‘‘నిన్న మీకు వచ్చిన లేఖలో కేవలం ‘‘మూర్ఖుడు’’ అని వ్రాసి వుంది. దీనిమీద మీ అభిప్రాయమేంటి?’’
అప్పుడు మంత్రి ఇలా అంటాడు... ‘‘చూడండి! ఎవరైతే నాకు లేఖలు రాసి పంపిస్తారో.. వాళ్లందరు తమ అభిప్రాయాలను లేఖలో రాసి, పేర్లు రాయకుండా వుంటారు. కానీ నాకు నిన్న మొదటిసారి ఒక లేఖ వచ్చింది.. అందులో ఎవరో తన పేరును మాత్రమే రాసి.. అభిప్రాయం రాయకుండా పంపించాడు.’’