ఒకరోజు ఒక కాంగ్రెస్ మంత్రి ప్రసంగం చేస్తూ ఒక చిన్న కథను వినిపిస్తాడు.
కథ : ఒక వ్యక్తికి ముగ్గురు కొడుకులు వుండేవారు. అతడు ఆ ముగ్గురిలో ఒక్కొక్కరికి 100 - 100 - 100 రూపాయలు ఇచ్చాడు.
ఆ వంద రూపాయలతో ఒక రూమ్ నిండా సరిపడేంత వస్తువు ఏదైనా వుంటే తీసుకుని రమ్మని చెప్పాడు.
మొదటి కొడుకు 100 రూపాయలతో పచ్చగడ్డి తీసుకుని వచ్చాడు... కానీ అది రూమ్ నిండా సరిపోలేదు.
రెండవ కొడుకు 100 రూపాయలతో పత్తి (దూది) తీసుకువచ్చాడు... అది కూడా రూమ్ నిండా సరిపోలేదు.
మూడవ కొడుకు ఇచ్చిన 100 రూపాయలలో కేవలం 1 రూపాయితో కొవ్వొత్తి తీసుకువచ్చాడు. దాంతో ఆ రూమ్ మొత్తం ప్రకాశవంతంగా వెలిగి సరిపోయింది.
ఈ విధంగా ఆ మంత్రి కథను చెబుతూ ఇలా అంటాడు.
మన రాహుల్ గాంధీ ఆ కథలో చెప్పినట్లుగా మూడవ కొడుకు లాంటివాడు. ఏరోజు నుంచి అయితే అతను రాజకీయాల్లోకి వచ్చాడో... ఆరోజునుంచి మన దేశం ప్రకాశవంతంగా, సమృద్ధిగా మెలుగుతోంది.
మంత్రి తన ప్రసంగాన్ని ఈ విధంగా కొనసాగిస్తుండగా.. ఇంతలో వెనక నుంచి అన్నాహజారే గొంతు వినిపిస్తుంది.
అన్న హజారే : ఆ ఒక్క రూపాయితో కొవ్వొత్తి తీసుకువచ్చి వెలుగు తీసుకొచ్చాడు సరే.. మిగతా 99 రూపాయలు ఎక్కడున్నాయి..?