ఒకరోజు శాంతా తన ఇద్దరు మిత్రులైన జపానీ, బ్రిటీష్ ఫ్రెండ్స్ తో కలిసి సముద్రంలో తిరగడానికి వెళతారు.
అయితే హఠాత్తుగా ఒక తుఫాను రావడం వల్ల వారు ఒక దీవిలో దిగిపోయారు.
ఆ దీవిలో ఎవ్వరూ లేరు.. నాలుగువైపులా ప్రశాంతంగా ఏ అరుపులు లేకుండా వుంది.
అప్పుడు వారు ముగ్గురు వెలుతురు కోసం వెదకడం మొదలుపెట్టారు.
అలా వెళుతూ వుండగా.. జపనీస్ వాడికి ఒక మాయాదీపం కనిపిస్తుంది. అతను దానిని మెల్లగా రుద్దగా.. అందులో నుంచి జినీ బయటకు వస్తాడు.
జీనీ వాళ్లతో ఇలా అంటాడు.. ‘‘మీ ముగ్గురికి నేను ఒక్కొక్క వరాన్ని ఇస్తాను. ఏం కావాలో కోరుకోండి’’
ఈ మాట అనగానే ముగ్గురు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ, ఆలోచనలో పడిపోతారు.
అందులో జపనీస్ ముందుకు వచ్చి... ‘‘నేను నా ఇంటికి తిరిగి వెళ్లాలని అనుకుంటున్నాను. కాబట్టి నన్ను త్వరగా ఇంటికి పంపించు’’ అని కోరుకుంటాడు.
దీంతో ఆ జీనీ తన చేతులతో మాయ చేసి, ఆ జపనీస్ ని తన ఇంటికి పంపివేస్తాడు.
బ్రిటీష్ వాడు కూడా అదే కోరికను కోరుకొని తన ఇంటికి వెళ్లిపోతాడు.
ఇక శాంతా ఒకడే తీవ్రంగా ఏదో ఆలోచిస్తుంటాడు. కొద్దిసేపు తరువాత శాంతా తన కోరికను తెలుపుతూ.. ‘‘చూడు బ్రదర్.. వాళ్లిద్దరూ ఇక్కడి నుండి వెళ్లిపోవడం వల్ల నేను ఒంటరివాణ్ణి అయిపోయాను. నువ్వొక పని చేయ్.. వాళ్లిద్దరిని తిరిగి ఇక్కడికి రప్పించు. నాకు తోడుగా వుంటారు’’ అని అంటాడు.
జీనీ మాయ చేసి వాళ్లిద్దరినీ తిరిగి రప్పిస్తాడు. దీంతో వారిద్దరూ కోపంతో... ‘‘నీయబ్బా.. ఇదేం కోరిక కోరుకున్నావ్ రా గాడిదా.. అడ్డగాడిదా... దున్నపోతా.. రేయ్ వెధవా నువ్వు కూడా కోరిక కోరుకుని ఇంటికి వెళ్లిపోవచ్చు కదరా బుర్ర లేని సన్నాసి.. ఒరేయ్ ఆగురా రేయ్’’ అంటూ అతన్ని తరిమి తరిమి కొడతారు.