ఒకరోజు ఒక టీచర్, ఒక స్టూడెంట్ తో ప్రశ్నలు అడుగుతుంది.
టీచర్ : టిప్పు సుల్తాన్ ఏ యుద్ధంలో మరణించాడు?
విద్యార్థి : అతని ఆఖరి యుద్ధంలో...!
టీచర్ : గంగానది ఏ రాష్ట్రంలో పారుతుంది?
విద్యార్థి : లిక్విడ్ రాష్ట్రంలో..!
టీచర్ : మహాత్మాగాంధీ ఎప్పుడు జన్మించారు?
విద్యార్థి : ఆయన పుట్టినరోజున జన్మించారు!
టీచర్ : 15 ఆగస్టు రోజు ఏమవుతుంది?
విద్యార్థి : 15 ఆగస్టు రోజు వస్తుంది.
టీచర్ : 6 మందికి 8 మామిడిపళ్లు ఎలా పంచుతావు?
విద్యార్థి : మ్యాంగో షేక్ చేయించి పంచుతాను...
ఈ సమాధానాలు విని టీచర్ డైరెక్ట్ కోమాలోకి వెళ్లిపోయింది.