టీచర్ : హోమ్ వర్క్ ఎందుకు చేయలేదు?
పప్పు : మేడమ్.. ఇంట్లో పవర్ లేక చేయలేదు.
టీచర్ : అయితే కొవ్వొత్తి వెలిగించుకోవచ్చు కదా!
పప్పు : మేడమ్.. అగ్గిపెట్టే ఆ సమయంలో లేదు.
టీచర్ : అగ్గి పెట్టే ఎందుకు లేదు?
పప్పు : పూజామందిరంలో పెట్టారు
టీచర్ : మరి అక్కడే వెళ్లి తెచ్చుకోవచ్చు కదా!
పప్పు : నేనప్పుడు స్నానం చేసుకోలేదు.
టీచర్ : ఎందుకు స్నానం చేసుకోలేదు.
పప్పు : ఆ సమయంలో ఇంట్లో నీళ్లు లేవు మేడమ్
టీచర్ : అప్పుడు నీళ్లు ఎందుకు లేవు?
పప్పు : మేడమ్.. అప్పుడు ఇంట్లో వున్న మోటర్ పనిచేయలేదు.
టీచర్ : ఒరేయ్ తెలివి తక్కువ దద్దమ్మ.. మోటర్ ఎందుకు ఆన్ అవ్వలేదు?
పప్పు : నేను ముందే చెప్పాను కదా మేడమ్.. ఇంట్లో పవర్ లేదని!