ఒక రోజు రవి తన భార్య పనిచేసే ఆఫీసు నుంచి వెళ్లాడు. భార్యను పలకరించి వెళ్దామని ఆఫీసుకు దగ్గరగా వెళ్లాడు.
అక్కడ అతనికి కోపం తెప్పించే దృశ్యం కనిపించింది. అతను కిటికీలో నుంచి తన భార్య.. ఆమె బాస్ ఒడిలో కూర్చుని వుండడాన్ని చూసి ఒక్కసారిగా కోపగించుకున్నాడు.
వెంటనే రవి లోపలికి వెళ్లి తన భార్యను బయటకు తీసుకువచ్చాడు. అప్పుడు రవి...
‘‘ఇటువంటి ఆఫీసులో అస్సలు పనిచేయకూడదు. అయినా ఇంత పెద్ద ఆఫీసు పెట్టుకుని, రెండో కూర్చీ లేకపోతే ఎలా? కాబట్టి నువ్వు జాబ్ మానేయ్’’ అని చెప్పాడు.