కొత్తగా పెళ్లైనా ఒక జంట తమ భవిష్యత్తు జీవితాన్ని గడపడానికి నగరానికి వస్తారు.
చేరుకోగానే వాళ్లు తమకోసం అద్దెకు ఒక ఇంటిని తీసుకున్నారు. వారి ఇంటి పక్కనే వున్న పొరుగువారితో కూడా స్నేహంగా వుండేవారు.
ఒకరోజు కొత్తగా పెళ్లయిన మహిళ ఉదయాన్నే లేచి కిటికీలో నుంచి పొరుగింటివారు ఉతికి, ఆరేయడానికి వేసిన బట్టలను చూస్తుంది.
అది చూసిన ఆమె తన భర్తతో.. ‘‘ఇదిగో చూడండి. మన పొరుగింటివారికి బట్టలు కడగటం సరిగ్గా రాదనుకుంట! అసలు ఆమె ఎటువంటి సబ్బును ఉపయోగిస్తుందో ఏమో! చూడ్డానికి బట్టలు ఎంత మురికిగా వున్నాయో చూడండి!’’
భర్త మాత్రం ఆమె చెప్పిన మాటలకు ఎటువంటి సమాధానం ఇవ్వకుండా అలాగే వింటుంటాడు.
ఇలాగే ప్రతిరోజు ఆమె తన పొరుగింటివారు ఉతికి, ఆరేసిన బట్టల గురించి తన భర్తతో చెబుతూనే వుంటుంది.
ఒక నెల తరువాత భార్య ఉదయాన్నే లేచి కిటికీలో నుంచి చూడగానే ఒక్కసారి కలవరపడిపోతుంది. షాకింగ్ లో వున్న ఆమె తన భర్తతో.. ‘‘ఏవండి.. ఈసారి మన పొరుగింటివారు ఏదో మంచి సబ్బును ఉపయోగించినట్లున్నారు. అంతేకాదు.. ఆమె బట్టలను ఉతకడం నేర్చుకుంది. ఈరోజు బట్టలు చాలా బాగా వున్నాయి. నాకు అర్థం కానిదేమిటంటే.. ఆమె ఇలా ఎలా చేయగలిగింది?’’ అని అంటుంది.
అప్పుడు ఆమె భర్త.. ‘‘ఈరోజు ఉదయాన్నే నేను చాలా త్వరగా లేచి మన గదిలో వున్న కిటికీలను బాగా శుభ్రం చేశాను. అందుకే అవి అలా కనిపిస్తున్నాయి.’’ అని అంటాడు.
ఒకరోజు ఒక బాబా తన ఆశ్రమం బయట కూర్చొని తన దగ్గరకు వచ్చిన భక్తుల దు:ఖాలను వింటూ.. వాటి పరిష్కారాల కోసం సలహాలు ఇస్తున్నాడు.
ఇంతలోనే ఆ ఆశ్రమంవైపుగా వచ్చిన ఒక భక్తుడు తన పెళ్లి విషయం గురించి అడుగుదామని నిశ్చయించుకుని బాబా దగ్గరికి వెళతాడు.
భక్తుడు : జై హో బాబా.. జై హో! బాబా నాకు 35 ఏళ్లు. నాకు ఇంతవరకు పెళ్లి జరగలేదు. తొందరగా నాకు పెళ్లి అవడానికి ఏదైనా ఒక మార్గం చెప్పండి.
బాబా : ఇంతకు నువ్వు ఏం చేస్తావ్..?
భక్తుడు : పెళ్లి చేసుకోవడానికి నేను ఏ పని మొదలుపెడితే బాగుంటుందంటారు?
బాబా : నువ్వు ఏదైనా ఒక మిఠాయి షాపు నడుపుకుంటే మంచిది.
భక్తుడు : అలా అయితే మా నాన్నగారు 30 సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన మిఠాయి షాపునే నేను ఇప్పటివరకు నడుపుతున్నాను.
బాబా : ప్రతి శనివారం ఉదయం 11 గంటలకు నీ మిఠాయి షాపును ఓపెన్ చేసుకో.
భక్తుడు : నా మిఠాయి షాపు శని మందిరం పక్కనే వుంది. ఇంకా నేను షాపును కూడా శనివారం రోజు 11 గంటలకు తెరుస్తాను.
బాబా : నల్లరంగులో వున్న కుక్కలకు ప్రతిరోజు స్వీట్లు తినిపించు.
భక్తుడు : నా ఇంట్లో నల్లరంగులో వున్న రెండు కుక్కలున్నాయి. వాటిని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్వీట్లు తినిపిస్తాను.
బాబా : ప్రతి సోమవారం ఏదైనా ఒక మందిరాన్ని దర్శించుకో.
భక్తుడు : నేను కేవలం సోమవారమే కాదు.. ప్రతిరోజు మందిరానికి వెళ్తుంటాను. దర్శనం చేసుకోకుండా నేనస్సలు షాప్ ఓపెన్ చేయను.
బాబా : ఎంతమంది అన్నలు, చెల్లెలు వున్నారు?
భక్తుడు : మీ లెక్కప్రకారం నాకు పెళ్లిజరగాలంటే ఎంతమంది అన్నలు, చెల్లెళ్లు వుండాలి?
బాబా : ఇద్దరు అన్నలు, ఒక చెల్లి వుండాలి.
భక్తుడు : అరె బాబాగారు.. నాకు నిజంగానే ఇద్దరు అన్నలు, ఒక చెల్లి వుంది.
బాబా : ఇతరులకు దానం చేస్తూ వుండు.
భక్తుడు : బాబా నేను ఒక అనాథాశ్రమాన్ని నడుపుతున్నాను. ప్రతిరోజు దానం కూడా చేస్తాను.
బాబా : ఒకసారి ఏదైనా ఒక తీర్థస్థానాన్ని దర్శించుకో.
భక్తుడు : బాబా.. మీ లెక్కప్రకారం నాకు పెళ్లి జరగాలంటే ఎన్నిసార్లు తీర్థస్థానాలకు వెళ్లాల్సి వుంటుంది?
బాబా : జీవితంలో ఒక్కసారైనా తీర్థస్థానానికి వెళ్లాలి.
భక్తుడు : అలా అయితే నేను మూడుసార్లు వెళ్లొచ్చాను.
బాబా : ప్రతిరోజు నీలం రంగులో వున్న దుస్తులను ధరించుకో!
భక్తుడు : బాబా నా దగ్గర కేవలం నీలం రంగులో వున్న దుస్తులే వున్నాయి. నిన్నటితో వాటిని కడగడానికి లాండ్రీకి ఇచ్చాను. అవి రాగానే కేవలం వాటినే ధరిస్తాను.
ఇక బాబా చేసేదేమి లేక నిశ్శబ్దంగా ధ్యానంలోకి వెళ్లిపోయాడు. భక్తుడు తనలో తాను నవ్వుకుని ఇలా అంటాడు.
భక్తుడు : బాబా.. నీకో మాట చెప్పాలనుకుంటున్నాను!
బాబా : తప్పకుండా చెప్పు భక్తుడా.. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నిరభ్యరంతంగా చెప్పొచ్చు.
భక్తుడు : నేను ముందునుంచే వివాహితుడ్ని. నాకు పెళ్లయి 10 సంవత్సరాలు అయింది. ముగ్గురు పిల్లలు కూడా వున్నారు. ఇక్కడి నుంచి వెళుతుంటే నువ్వు కనిపించావు. ఒక్కసారి నిన్ను కెలుకుదామని ఇక్కడికి వచ్చా! హాహాహాహా!
ఈ మాటలు వినగానే బాబా ధ్యానంలో నుంచి ఏకంగా కోమాలోకి వెళ్లిపోయాడు.
బాస్ (లేడీ సెక్రటరీతో) : నువ్వు, నేను ఒక వారం వరకు లండన్ వెళుతున్నాం! అర్జెంట్ మీటింగ్ వుంది.
లేడీ సెక్రటరీ (భర్తతో) : ఆఫీసు పనిమీద నేను మా బాస్ తో కలిసి ఒక వారం వరకు లండన్ వెళుతున్నాను. అర్జెంట్ మీటింగ్ వుంది.
భర్త (గర్ల్ ఫ్రెండ్ తో (టీచర్)) : నా భార్య వారం రోజులవరకు బయటకు వెళుతోంది. ఆమె వెళ్లగానే నువ్వు మా ఇంటికి వచ్చేయ్!
గర్ల్ ఫ్రెండ్ (టీచర్) (స్టూడెంట్ లతో) : పిల్లలూ.. నేను ఒక వారం రోజులవరకు బయటకు వెళుతున్నాను. కాబట్టి మీ అందరికి సెలవులు ఇచ్చేస్తున్నాను.
ఒక స్టూడెంట్ (నాన్నతో (బాస్)) : నాన్నగారు.. మా స్కూల్ లో వారంరోజులవరకు సెలవులు ఇచ్చేశారు. నేను ఇంటికి వస్తున్నాను. మీరెక్కడికీ వెళ్లకండి!
బాస్ (సెక్రటరీతో) : నా కొడుకుకి స్కూలులో సెలవులు ఇచ్చారట. అతను నా దగ్గరికి వస్తున్నాడు. కాబట్టి మన లండన్ టూర్ క్యాన్సిల్.
సెక్రటరీ (భర్తతో) : లండన్ టూర్ క్యాన్సిల్ అయిపోయింది.
భర్త (గర్ల్ ఫ్రెండ్ తో (టీచర్)) : నా భార్య మీటింగ్ కోసం లండన్ వెళ్లడం లేదు. కాబట్టి మన ప్రోగ్రామ్ క్యాన్సిల్.
టీచర్ (స్టూడెంట్స్ తో) : పిల్లలూ.. నేను వెళ్లాల్సిన టూర్ క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి మీకు సెలవులు ఇవ్వడం లేదు.
ఒక స్టూడెంట్ (తండ్రి (బాస్)తో) : నాన్న.. నేను రాలేను. ఎందుకంటే మా స్కూల్లో సెలవులు క్యాన్సిల్ అయ్యాయి
......
.....
.......
......
.......
.....
.....
బాస్ (సెక్రటరీతో) : నా కొడుకు రావడం లేదు. కాబట్టి మనం ఒక వారం రోజులవరకు లండన్ వెళుతున్నాం..!
వడ్డీవ్యాపారి తను అప్పిచ్చిన డబ్బులను వసూలు చేసుకోవడానికని ఒకరోజు వెంగుళప్ప అనే వ్యక్తి ఇంటికి వెళతాడు.
వడ్డీవ్యాపారి : ఒరేయ్ వెంగుళప్పా.. నువ్వు ఇంతవరకు నా అప్పు తిరిగి ఇవ్వలేదు. ఎప్పుడిస్తావ్?
వెంగుళప్ప : సరే.. తొందరగానే ఇచ్చేస్తాను. ఉద్యోగం చేస్తున్న మొదటి వేతనం రాగానే నీ మొత్తం డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తాను.
వడ్డీవ్యాపారి : అవునా! ఉద్యోగం వచ్చినందుకు నీకు చాలా శుభాకాంక్షలు. అయినా ఉద్యోగం ఎప్పుడు సంపాదించావ్?
వెంగుళప్ప : దొరికేస్తుంది.. చాలా తొందరగానే దొరికేస్తుంది! నేను అప్లికేషన్ వేయగానే నాకు ఉద్యోగం వచ్చేస్తుంది.
వడ్డీవ్యాపారి : అంటే.. ఇంతవరకు నువ్వు అప్లికేషన్ వేయలాదా?
వెంగుళప్ప : అప్లికేషన్ అయితే పంపించేస్తా! కానీ సార్ అయితే ఇంకా పేపర్ మీద ఉద్యోగం గురించి విజ్ఞాపనం వేయిస్తానన్నారు. ఆ తరువాత నాకు అప్లికేషన్ పంపించమన్నారు.
వడ్డీవ్యాపారి : అంటే.. ఇంతవరకు ఉద్యోగం వుందని పేపర్ లో కూడా వేయలేదా?
వెంగుళప్ప : అలా కాదు.. సార్ ఏమంటున్నారంటే.. ఆఫీస్ లో ఉద్యోగాలు ఖాళీ అయితే నాకు లెటర్ పంపిస్తానన్నారు.
వడ్డీవ్యాపారి : అంటే.. ఇంతవరకు ఆఫీస్ లో ఉద్యోగాలు ఖాళీ లేవన్నమాట!
వెంగుళప్ప : ఇంకేముంది.. మొదట ఆ ఆఫీస్ లో వున్న క్లర్క్ ఉద్యోగం మానేయడానికి రెడీగా వున్నాడు. అతను వెళ్లగానే నేను అతని స్థానంలోకి వెళ్లిపోతాను.
(ఈ మాటలు విని వడ్డీవ్యాపారికి ఒక్కసారిగా చిర్రెత్తుకొస్తుంది. దీంతో అతను కోపంతో ఇలా అంటాడు...)
వడ్డీవ్యాపారి : ఆ అవును.. ఆ ఆఫీస్ లో వున్న క్లర్క్ కూడా వేరేచోట మంచి ఉద్యోగం దొరికినప్పుడు ఇందులో మానేస్తాడు కదా! అలాగే అతనికి ఆ మంచి ఉద్యోగం దొరకాలంటే ముందు ఆ ఆఫీస్ పనిచేసే మంచి క్లర్క్ తన ఉద్యోగాన్ని వదిలేసి వెళ్లిపోవాలి. అతనికి కూడా ఎప్పుడైతే మంచి ఉద్యోగం వస్తుందో అప్పుడు మానేస్తాడు. ఇలాగే భూమి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంటుంది కదా!
అని ఇలా వెంగుళప్పతో వడ్డీవ్యాపారి మొత్తం కథను అల్లుకుంటూ అల్లుకుంటూ చెబుతుంటాడు. దీంతో
వెంగుళప్ప : అరె. మీరు నిజంగానే తెలివి చాలా పెరిగిపోయిందే! నేను చెప్పుకుండానే మొత్తం మీరే అర్థం చేసుకున్నారు. నేను మీ దగ్గర అప్పు తీసుకుని చాలా మంచి చేశాను.
ఈ మాటలు వినగానే వడ్డీవ్యాపారి తన బట్టలు చించుకుని, తలజుట్టు పీక్కుని, గట్టిగా అరుస్తూ.. అక్కడి నుంచి పరుగులు తీశాడు.
ఒకరోజు ఒక అడవిలో కొంతమంది కలిసి యాగాన్ని ఏర్పాటు చేశారు. దేవతలను ఆనందింపజేయడం కోసం గట్టిగా అరుస్తూ.. మంత్రాలను చదువుతున్నారు.
అయితే అంతలోనే అక్కడికి ఒక భయంకరమైన రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు.
లావాలాగా ఎగిసిపడుతున్న మంటల్లో నుంచి రక్తంతో నిండి ఆ రాక్షసుడు దంతాలు, వికారమైన రూపంతో చాలా భయంకరంగా వున్నాడు.
ఆ రాక్షసుడిని చూసి అక్కడున్న వారందరూ పరుగులు తీయడం మొదలు పెట్టారు.
ఎక్కడబడితే అక్కడ, ఎలా పడితే అలా, తమకిష్టమున్న చోట ప్రతిఒక్కరు క్షణాల్లో పరుగులు తీశారు. కొద్దిసేపటిలో ఆ ప్రదేశమంతా ఖాళీ అయిపోయింది.
అయితే ఒక్క వ్యక్తి మాత్రం అక్కడి నుంచి పరుగులు తీయకుండా ప్రశాంతంగా ఆ యాగం దగ్గరే కూర్చున్నాడు.
అప్పుడు రాక్షసుడు భీకరంగా అరుస్తూ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి ఇలా అంటాడు... ‘‘నేనెవరినో నీకు తెలియదా?’’
ఆ వ్యక్తి రాక్షసుడికి సమాధానంగా ఇలా చెబుతాడు... ‘‘ఆఁ.. నువ్వెరవో నాకు తెలుసు! నువ్వు కుంభీపాక నరకం నుంచి వచ్చిన రాక్షసుడివి!’’
చాలా ధీమాగా మాట్లాడుతున్న ఆ వ్యక్తిని చూసి రాక్షసుడు కోపగ్రస్థుడు అయ్యాడు.
రాక్షసుడు మళ్లీ ఆ వ్యక్తిని ఇలా అడిగాడు.. ‘‘అయితే నన్ను చూసి నీకు భయం కలగడం లేదా?’’
అప్పుడా వ్యక్తి... ‘‘లేదు.. నిన్ను చూసి నాకు అస్సలు భయం వేయట్లేదు!’’
ఈ మాటలు విన్న రాక్షసుడు ఒక్కసారిగా పిచ్చోడయిపోతాడు. కిందామీద పడి తలమునకలైపోతుంటాడు.
రాక్షసుడు గట్టిగా అరుస్తూ... ‘‘ఇక నిన్ను రక్షించడానికి ఇక్కడికి ఎవ్వరు రాలేరు? అయినా నన్ను చూసి నువ్వెందుకు భయపడటం లేదో చెప్పు!’’
అప్పుడా వ్యక్తి చాలా ప్రశాంతంగా ఇలా అంటాడు.. ‘‘ఎందుకంటే.. నాకు పెళ్లయి 25 సంవత్సరాలు అయింది. నా భార్య నీకంటే చాలా భయానకంగా వుంటుంది.’’
1. గడియారం 24 గంటలు టిక్ - టిక్ అంటూ వుంటుంది... భార్య కూడా 24 గంటలు కిట్ - కిట్ అంటూ వుంటుంది.
2. గడియారంలో వుండే ముల్లులు తిరిగి తిరిగి అక్కడికే చేరుకుంటాయి. అలాగే మీరు భార్యను ఎన్నిసార్లు ఒప్పించడానికి ప్రయత్నించినా తిరిగి తిరిగి తన మాటే నెగ్గుకోవడానికి ప్రయత్నిస్తుంది.
3. గడియారం చెడిపోతే మెకానిక్ దగ్గరకు వెళతుంది. అదే భార్య కోపగించుకుంటే తన అమ్మవారింటికి వెళ్లిపోతుంది.
4. గడియారం చార్జ్ చేయడానికి బ్యాటరీని ఉపయోగిస్తారు. భార్యను చార్జ్ చేయడానికి జీతం ఇచ్చుకోవాల్సి వుంటుంది.
5. గడియారంలో 12 అయితే మూడు ముల్లులు ఒకేచోటుకి చేరుకుంటాయి... కానీ భార్య ఎక్కువ కోపానికి గురయితే ముగ్గురిలా కనిపిస్తుంది.
6. గడియారం మోగడానికి ఒక ఫిక్స్ టైమింగ్ అంటూ వుంటుంది. కానీ భార్య మోగడానికి (అరవడానికి) ఫిక్స్ టైమింగ్ అంటూ వుండదు.
7. గడియారం చెడిపోతే నిలబడిపోతుంది.. కానీ భార్య మెదడు చెడిపోతే అరవడానికి సిద్ధంగా వుంటుంది.
8. గడియారాన్ని మీరు అనుకున్న సమయాల్లో మార్చుకోవచ్చు. కానీ భార్యను మీరు వదిలించుకోవాలన్న కుదరదు. పైగా వారు చెప్పినట్లుగా నడుచుకోవాల్సి వుంటుంది.
ఒకరోజు రమేష్ అనే ఒక అబ్బాయి తన ఫ్రెండ్ అయిన రాజుని కలవడానికి చెన్నై వెళతాడు.
చెన్నైలో తన ఫ్రెండ్ రాజుని కలుసుకుని అక్కడే ఒక వారం రోజులు పాటు వుండాలని నిశ్చయించుకుంటాడు.
ఒకరోజు రమేష్ మార్కెట్ లో ఏదైనా వస్తువు కొనడానికని ఒక్కడే బయలుదేరుతాడు.
అలా రమేష్ బయలుదేరుతుండగా రాజు ఈ విధంగా అతనికి చెబుతాడు.
రాజు : ‘‘నువ్వు ఏదైనా వస్తువు కొనేటప్పుడు దుకాణదారుడు చెప్పే ఖరీదులో సగమే ఇస్తానని చెప్పు. దీంతో నువ్వు కొంచెం బెనిఫిట్ పొందుతావ్’’
అలా అన్న తరువాత రాజు తన ఆఫీస్ కి వెళ్లిపోతాడు.
మార్కెట్ లోకి వెళ్లిన రమేష్ బజారులో కాసేపు విహరిస్తాడు. కాసేపు తరువాత స్టీరియో కొనడానికని ఒక దుకాణానికి వెళతాడు.
రమేష్ : ‘‘ఈ స్టీరియో వెల ఎంత?’’
దుకాణదారుడు : ‘‘2000 రూపాయలు సార్’’
రమేష్ : ‘‘లేదు.. నేను కేవలం 1000 రూపాయలు మాత్రమే ఇస్తాను’’
దుకాణదారుడు : ‘‘1800 రూపాయలకైతే ఇవ్వగలను సార్’’
రమేష్ : ‘‘అలా అయితే నేను 900 రూపాయలే ఇస్తాను’’
దుకాణదారుడు : ‘‘చివరగా ఒక ఫైనల్ డెసిషన్ తీసుకుందాం.. 1500 రూపాయలు ఇవ్వండి చాలు’’
రమేష్ : ‘‘లేదు 750 రూపాయలే’’!
(చిరాకుతో) దుకాణదారుడు : ‘‘దీనెమ్మ జీవితం... సార్.. మీకి స్టీరియో ఫ్రీగానే ఇచ్చేస్తాను.. తీసుకోండి.. పోండి! థూ... నా బతుకు మీద బండ పడా’’
రమేష్ : ‘‘నేను ఈ వస్తువును ఫ్రీగా తీసుకోవాలంటే.. దీంతోపాటు నువ్వు ఇంకొక స్టీరియో ఇవ్వాలి!’’
దుకాణదారుడు : ‘‘ఎందుకురా... మొత్తం దుకాణమే తీసుకుపో.. నేనిక్కడ అడుక్కుతిని బతుకుతా... పోరా పో’’