Funny Stories
రెండువందల కోసం ఏమీ చేయలేదు!

ఒకరోజు ఒక వ్యక్తి తన భార్యతో కలిసి ఎగ్జిబిషన్ కు వెళతాడు. అక్కడ రకరకాల ఆటబొమ్మలు, గేమ్స్ అన్ని వున్నాయి. విమాన ప్రయాణం కూడా అక్కడ అందుబాటులో వుంది.

అప్పుడా వ్యక్తి తన మనసులో విమానంలో కొద్దిసేపు ప్రయాణిద్దాం అని అనుకుంటాడు. కానీ దాని టికెట్ ధర 200 రూపాయలు అని తెలిసి తన మొహాన్ని పెడమొహం చేసుకుంటాడు. 

విమానాన్ని నడిపే వ్యక్తి ఇతడిని చూసి ఇలా అంటాడు... ‘‘మీరిద్దరు (వ్యక్తి అతని భార్య) ఈ విమానంలో అర్ధగంట సేపు ప్రయాణించవచ్చు. ప్రయాణ సమయంలో మీరు నోటినుంచి ఒక్కమాట తీయకుండా, అరవకుండా వుంటే.. నేను టికెట్ డబ్బులు తీసుకోను. ఒకవేళ అరిచినా, నోరు తెరిచినా టికెట్ డబ్బులు తీసుకుంటాను’’ అని అంటాడు. 

ఆ వ్యక్తి ఈ మాట విన్న కొద్దిసేపు ఆలోచిస్తాడు. ఆ తరువాత సంతోషంగా సరే అని ఒప్పుకుని తన భార్యతో విమానంలో ఎక్కుతాడు. 

వ్యక్తి తన భార్యతో విమానంలో ఎక్కిన తరువాత పైలట్ విమానాన్ని నడపటం ప్రారంభించాడు. ఎన్నో రకాల విన్యాసాలు చేస్తాడు. విమానాన్ని పైకి, కిందకు, కొద్దిసేపటి వరకు రివర్స్ లో తిప్పడం, అప్పుడు డైవ్ చేయడం వంటివి చేశాడు. కానీ ఎంతసేపటికి ఆ వ్యక్తి తన నోరుని కదపకుండా జాగ్రత్త పడతాడు. 

ఇలా మొత్తం వ్యవహారం అర్దగంటసేపు వరకు జరుగుతుంది. చివరికి పైలట్ తన ఓటమిని ఒప్పుకుని విమానాన్ని కిందకు దింపుతాడు. 

అప్పుడా పైలట్ ఆ వ్యక్తితో ఇలా అంటాడు... ‘‘నిన్ను ఒప్పుకోవచ్చయ్యా... నేను విమానంతో చేసిన విన్యాసాలను చూసి ప్రతిఒక్కరు భయపడిపోతారు. అరవకుండా అస్సలు వుండలేరు. కానీ నువ్వు మాత్రం నీ నోరు కూడా తెరవకుండా కూర్చున్నావు. నీకు హ్యాట్సాఫ్ బాస్’’

అప్పుడా వ్యక్తి పైలట్ తో ఇలా అంటాడు... ‘‘ఇప్పుడు నా ఆవేదనను మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. చివరాఖరికి నా భార్య కూడా విమానంలో నుంచి కిందకు పడిపోయినా అరవలేదు.. లేకపోతే నా 200 రూపాయలు పోతాయి కదా’’

 

పెళ్లయిన కొత్తలో.... పెళ్లయిన తరువాత!

ఇంకా పెళ్లయి కేవలం ఒక సంవత్సరమే అయింది...

సంతోషంతో నేను అతలాకుతలమైపోతున్నాను....

నా జీవితంలో సంతోషాలు ఎలా పెరిగిపోయాయంటే...

కొన్నింటిని తట్టుకుంటున్నాను.. కొన్నింటిని తట్టుకోలేకపోతున్నాను...

ఉదయాన్నే భార్య చాయ్, కాఫీ తీసుకురావడం...

కొంచెం సిగ్గుతో నిద్రపోయిన మమ్మల్ని చిరునవ్వుతో లేపడం...

ఎంతో ఆప్యాయంగా తన చేతిని మన జుట్టును తగిలించడం...

చిరునవ్వుతో తను మాట్లాడే కొన్ని మాటలు గుర్తు చేసుకుంటే.... 

‘‘డార్లింగ్ చాయ్ తాగు... త్వరగా లేచి రెడీ అవు.. మీరు ఆఫీస్ కు కూడా వెళ్లాలి కదా...’’

భార్య దేవత రూపంలో వచ్చింది....

మనస్సు మరియు మెదడు మొత్తం కేవలం తనే నిండి వుండేది....

శ్వాస తీసుకునేటప్పుడు కూడా తన పేరే గుర్తుకు వచ్చేది....

ఒక్క నిమిషం కూడా తనను వదిలి వుండలేకపోయేవాణ్ణి.....

 

పెళ్లయిన 5 సంవత్సరాల తరువాత...

ఉదయాన్నే మేడమ్ టీ తీసుకుని రావడం...

టీ ని టేబుల్ మీద పెట్టి నీళ్లను ముఖం మీద చిట్లించడం...

ఇప్పుడు తన మాటలు... ‘‘త్వరగా లేచి ఆఫీస్ కెళ్లు.. వెళ్తూవెళ్లూ చింటూని కూడా స్కూల్ లో వదిలేయ్..’’

మళ్లీ ఇంకొకసారి ఆమె గొంతు వినిపించింది....

‘‘ఇంకెంతసేపు అలాగే దెయ్యంలా నిద్రపోతావ్... త్వరగా లేచి ఆఫీస్ కి తగలాడు.. ఒకవేళ చింటూకు స్కూల్ వెళ్లడానికి లేట్ అయితే... చంపేస్తా’’

చింటూగాడి టీచర్ ని కూడా చెప్పుకోవాలి...

ఇంటి భార్య ఏ రూపం దాల్చుకుని అడుగుపెట్టిందో...

మనస్సు మరియు మెదడుపై కేవలం నల్లగా వ్యాపించి వుంది....

శ్వాస్ తీసుకుంటున్నప్పుడు కూడా తను పెట్టే బాధలే గుర్తుకు వస్తాయి.....

ఇప్పుడు ప్రతిక్షణం మనస్సులో ఒకే మాట తోస్తుంది...

‘‘గడిచిన రోజులు మళ్లీ తిరిగి వస్తాయా... నేను మళ్లీ తిరిగి పెళ్లికానివాడిలా తయారవుతానా..’’

పెళ్లయిన ప్రతిఒక్కరూ 5 సంవత్సరాల తరువాత ఆలోచించేది ఇదే....

అమ్మాయిల పేరువిని పారిపోయిన కుర్రాడు....

ఒక తల్లికి నలుగురు కూతుళ్లు వుండేవారు. 

అందులో మొదటి అమ్మాయి పేరు విరిగిన, 

రెండవ అమ్మాయి పేరు చిరిగిన, 

మూడవ అమ్మాయి పేరు పాడయిపోయిన, 

నాలుగవ అమ్మాయి పేరు చనిపోయిన... 

ఇలా ఈ విధంగా ఆ తల్లి తన కూతుళ్లకు పేర్లు పెట్టుకుంది. 

ఒకరోజు వీరి ఇంటికి ఒక అతిథి వస్తాడు. 

అతనితో తల్లి అడుగుతూ... ‘‘మీరు కుర్చీలో కూర్చుంటారా లేక చాప మీద కూర్చుంటారా?’’

అతిథి : ‘‘కుర్చీ మీద కూర్చుంటాను’’

తల్లి : ‘‘విరిగిన..! కుర్చీ తీసుకుని రా’’!

అతిథి : ‘‘వద్దులేండీ..! నేను చాపమీదే కూర్చుంటాను’’

తల్లి : ‘‘చిరిగిన..! చాప తీసుకుని రా’’

అతిథి : ‘‘ఉండనివ్వండి... నేను కింద నేలపైనే కూర్చుంటాను’’

అలా అని ఆ అతిథి నేలమీద కూర్చుంటాడు. కొద్దిసేపు తరువాత....

తల్లి : ‘‘మీరు టీ తీసుకుంటారా.. పాలు తీసుకుంటారా?’’

అతిథి : ‘‘టీ’’

తల్లి : ‘‘పాడయిపోయిన...! టీ తీసుకుని రామ్మా..’’

అతిథి : ‘‘వద్దు వద్దులెండి.. నేను పాలు తీసుకుంటాను’’

తల్లి : ‘‘చనిపోయిన..! ఆవు పాలు తీసుకుని రామ్మా’’

ఈ మాటలు విన్న అతిథి ఏమీ తోచక అక్కడి నుంచి పారిపోతాడు.