ఒకరోజు రమేష్ అనే ఒక అబ్బాయి తన ఫ్రెండ్ అయిన రాజుని కలవడానికి చెన్నై వెళతాడు.
చెన్నైలో తన ఫ్రెండ్ రాజుని కలుసుకుని అక్కడే ఒక వారం రోజులు పాటు వుండాలని నిశ్చయించుకుంటాడు.
ఒకరోజు రమేష్ మార్కెట్ లో ఏదైనా వస్తువు కొనడానికని ఒక్కడే బయలుదేరుతాడు.
అలా రమేష్ బయలుదేరుతుండగా రాజు ఈ విధంగా అతనికి చెబుతాడు.
రాజు : ‘‘నువ్వు ఏదైనా వస్తువు కొనేటప్పుడు దుకాణదారుడు చెప్పే ఖరీదులో సగమే ఇస్తానని చెప్పు. దీంతో నువ్వు కొంచెం బెనిఫిట్ పొందుతావ్’’
అలా అన్న తరువాత రాజు తన ఆఫీస్ కి వెళ్లిపోతాడు.
మార్కెట్ లోకి వెళ్లిన రమేష్ బజారులో కాసేపు విహరిస్తాడు. కాసేపు తరువాత స్టీరియో కొనడానికని ఒక దుకాణానికి వెళతాడు.
రమేష్ : ‘‘ఈ స్టీరియో వెల ఎంత?’’
దుకాణదారుడు : ‘‘2000 రూపాయలు సార్’’
రమేష్ : ‘‘లేదు.. నేను కేవలం 1000 రూపాయలు మాత్రమే ఇస్తాను’’
దుకాణదారుడు : ‘‘1800 రూపాయలకైతే ఇవ్వగలను సార్’’
రమేష్ : ‘‘అలా అయితే నేను 900 రూపాయలే ఇస్తాను’’
దుకాణదారుడు : ‘‘చివరగా ఒక ఫైనల్ డెసిషన్ తీసుకుందాం.. 1500 రూపాయలు ఇవ్వండి చాలు’’
రమేష్ : ‘‘లేదు 750 రూపాయలే’’!
(చిరాకుతో) దుకాణదారుడు : ‘‘దీనెమ్మ జీవితం... సార్.. మీకి స్టీరియో ఫ్రీగానే ఇచ్చేస్తాను.. తీసుకోండి.. పోండి! థూ... నా బతుకు మీద బండ పడా’’
రమేష్ : ‘‘నేను ఈ వస్తువును ఫ్రీగా తీసుకోవాలంటే.. దీంతోపాటు నువ్వు ఇంకొక స్టీరియో ఇవ్వాలి!’’
దుకాణదారుడు : ‘‘ఎందుకురా... మొత్తం దుకాణమే తీసుకుపో.. నేనిక్కడ అడుక్కుతిని బతుకుతా... పోరా పో’’