ఒకరోజు ఒక అడవిలో కొంతమంది కలిసి యాగాన్ని ఏర్పాటు చేశారు. దేవతలను ఆనందింపజేయడం కోసం గట్టిగా అరుస్తూ.. మంత్రాలను చదువుతున్నారు.
అయితే అంతలోనే అక్కడికి ఒక భయంకరమైన రాక్షసుడు ప్రత్యక్షమయ్యాడు.
లావాలాగా ఎగిసిపడుతున్న మంటల్లో నుంచి రక్తంతో నిండి ఆ రాక్షసుడు దంతాలు, వికారమైన రూపంతో చాలా భయంకరంగా వున్నాడు.
ఆ రాక్షసుడిని చూసి అక్కడున్న వారందరూ పరుగులు తీయడం మొదలు పెట్టారు.
ఎక్కడబడితే అక్కడ, ఎలా పడితే అలా, తమకిష్టమున్న చోట ప్రతిఒక్కరు క్షణాల్లో పరుగులు తీశారు. కొద్దిసేపటిలో ఆ ప్రదేశమంతా ఖాళీ అయిపోయింది.
అయితే ఒక్క వ్యక్తి మాత్రం అక్కడి నుంచి పరుగులు తీయకుండా ప్రశాంతంగా ఆ యాగం దగ్గరే కూర్చున్నాడు.
అప్పుడు రాక్షసుడు భీకరంగా అరుస్తూ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి ఇలా అంటాడు... ‘‘నేనెవరినో నీకు తెలియదా?’’
ఆ వ్యక్తి రాక్షసుడికి సమాధానంగా ఇలా చెబుతాడు... ‘‘ఆఁ.. నువ్వెరవో నాకు తెలుసు! నువ్వు కుంభీపాక నరకం నుంచి వచ్చిన రాక్షసుడివి!’’
చాలా ధీమాగా మాట్లాడుతున్న ఆ వ్యక్తిని చూసి రాక్షసుడు కోపగ్రస్థుడు అయ్యాడు.
రాక్షసుడు మళ్లీ ఆ వ్యక్తిని ఇలా అడిగాడు.. ‘‘అయితే నన్ను చూసి నీకు భయం కలగడం లేదా?’’
అప్పుడా వ్యక్తి... ‘‘లేదు.. నిన్ను చూసి నాకు అస్సలు భయం వేయట్లేదు!’’
ఈ మాటలు విన్న రాక్షసుడు ఒక్కసారిగా పిచ్చోడయిపోతాడు. కిందామీద పడి తలమునకలైపోతుంటాడు.
రాక్షసుడు గట్టిగా అరుస్తూ... ‘‘ఇక నిన్ను రక్షించడానికి ఇక్కడికి ఎవ్వరు రాలేరు? అయినా నన్ను చూసి నువ్వెందుకు భయపడటం లేదో చెప్పు!’’
అప్పుడా వ్యక్తి చాలా ప్రశాంతంగా ఇలా అంటాడు.. ‘‘ఎందుకంటే.. నాకు పెళ్లయి 25 సంవత్సరాలు అయింది. నా భార్య నీకంటే చాలా భయానకంగా వుంటుంది.’’