ఒకరోజు స్నేహ భయంతో తన స్నేహితురాలయిన లత ఇంటికి వెళుతుంది.
స్నేహితురాళ్లను అటువంటి భయ పరిస్థితిలో చూసిన లత ఏమయిందోనని ఆలోచిస్తుంటుంది.
లత : ఏమయిందే? ఎందుకు ఇలా వున్నావ్? ఏం జరిగింది?
స్నేహ : నిన్నరాత్రి నాకు ఒక భయంకరమైన కల వచ్చింది. అది ఎక్కడ నిజమౌతుందోనన్న భయం కలుగుతుంది.
లత : ఇంతకీ ఏం కల గన్నావో చెప్పు.
స్నేహ : ఎవరో నన్ను కత్తితో పొడిచి చంపినట్లుగా కల వచ్చింది.
లత : హాహాహాహా.. భయపడకు! అటువంటిదేమీ జరగదు. కలలు నిజమైతే.. నేను ఎన్నిసార్లు గర్భవతి అయ్యేదాన్నో!