ఒక అబ్బాయి సినిమా ఇండస్ట్రీలో వెళ్లడానికి ఉర్రూతలూగుతుంటే.. అతని తండ్రి సినీ జీవితానికి, నిజ జీవితానికి గల మధ్య తేడాను వివరించాలని అనుకుంటాడు.
ఆ నేపథ్యంలోనే ఒక గ్లాసులో మంచి నీళ్లను, ఇంకొక గ్లాసులో మద్యం తీసుకున్నాడు. అలాగే రెండు పురుగులను తీసుకున్నాడు.
వీటన్నింటిని తీసుకుని తన కొడుకు దగ్గరకు తీసుకుపోతాడు ఆ తండ్రి.
తన కొడుకుకు చూపిస్తూ.. మంచినీరున్న గ్లాసులో ఒక పురుగును... మద్యం వున్న గ్లాసులో ఇంకొక పురుగును వేశాడు.
కొద్దిసేపు తరువాత మద్యం గ్లాసులో వున్న పురుగు చనిపోగా.. మంచినీరు గ్లాసులో వున్న పురుగు బ్రతికేవుండి తేలాడుతోంది.
అప్పుడు తండ్రి తన కొడుకుతో.. ‘‘సినిమా జీవితం అంటే ఈ మద్యం లాంటిది.. నిజ జీవితం అంటే ఈ మంచినీరు లాంటిది’’ అని చెబుతాడు.
చివరగా ఆ తండ్రి తన కొడుకుతో.. ‘‘దీనిని చూసి నీకేం అర్థమయ్యింది’’ అని అడుగుతాడు.
అప్పుడు కొడుకు.. ‘‘మందు తాగితే మనక్కూడా పురుగులు అంటుకోవన్నమాట! అంటే సినిమా ఇండస్ట్రీలో మనకూ ఎవరూ పోటీరారు’’
అనుకున్నదొకటి.. అయినదొక్కటి!