పరీక్ష సమయంలో పరీక్ష రాయకుండా ఖాళీగా కూర్చున్న స్టూడెంట్ ని చూసి టీచర్ అతన్ని ఈ విధంగా అడుగుతుంది.
టీచర్ : ‘‘నువ్వు ఇంత దిగులుగా ఎందుకు కూర్చున్నావు?’’
స్టూడెంట్ సమాధానం ఇవ్వలేదు.
టీచర్ : ‘‘అసలేమైంది..? పెన్ను తెచ్చుకోవడం మర్చిపోయావా?’’
స్టూడెంట్ అస్సలు మాట్లాడటం లేదు.
టీచర్ : ‘‘నీ రోల్ నెంబర్ మర్చిపోయావా?’’
స్టూడెంట్ ఈసారి కూడా నోరు మెదపలేదు.
టీచర్ (కోపంగా) : ‘‘అరె, అసలేమైంది? ఇంతగా అడుగుతున్నాను. ఏం చెప్పవేంటి?’’
స్టూడెంట్ (చాలా కోపంగా) : ‘‘ఓయ్! నోరు మూసుకోవే తల్లీ, నేను స్లిప్ తప్పు తెచ్చుకున్నాను. నువ్వు చూస్తే అప్పటినుండి పెన్ను, పెన్సిల్ మీద పడ్డావ్’’ అని కసురుకున్నాడు.