ఒక రాజకీయ నాయకుడికి సినిమాలో నటించి ఒక హీరోయిన్ తో పరిచయం ఏర్పడుతుంది. కొన్ని నెలల తరువాత నాయకుడు ఆ హీరోయిన్ ని ప్రేమించసాగాడు. అప్పుడు తనలోతానే ఆ యాక్ట్రెస్ ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. కానీ ఆమె సినిమాల్లో నటిస్తుంది కాబట్టి ఇంకా వేరేవారితో ప్రేమవ్యవహారాలుగానీ, పరిచయాలుగానీ వున్నాయేమోనని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు.
అప్పుడు అతని సెక్రటరీ ద్వారా ఆ హీరోయిన్ చరిత్రను, వారి కుటుంబసభ్యుల గురించి వివరాలు సేకరించాడానికి ఒక డిటెక్టివ్ ని పెట్టమని చెబుతాడు. కానీ ఆ డిటెక్టివ్ కి ఈ రాజకీయ నాయకుడి కోసం పని చేస్తున్నట్టు తెలియకూడదని సూచిస్తాడు.
ఇలావుండగా.. సుమారు రెండునెలల తరువాత ఆ డిటెక్టివ్ ఆ హీరోయిన్ కి సంబంధించిన వివరాలు సేకరించి ఆ రాజకీయ నాయకుడి సెక్రటరీకి అప్పగిస్తాడు.
అది చదువుతున్న నాయకుడు.. ‘‘అమ్మాయి చరిత్ర అంత బాగానే వుంది. ఇంతవరకు ఆమెకు ఎటువంటి అఫైర్స్ లేవు. ఆమె కుటుంబసభ్యులు, వారికి సంబంధించిన బంధువులు చాలా అమాయకులని, వారికి బయటి గొడవలు ఎటువంటివి లేవు. కానీ ఈమధ్య కాలంలో ఆమె పరమ నీచ నికృష్టుడైన ఒక పనికిమాలిన రాజకీయ నాయకుడితో తిరుగుతోందని సమాచారం దొరికింది’’. ఇది చదివిన వెంటనే ఆ నాయకుడు తన స్పృహ కోల్పోయాడు.