లుధియానా
పంజాబ్ లో అతిపెద్ద నగరమైన లుధియానా.. సట్లేజ్ నది ఒడ్డుపై వుంది. లోధి వంశ పేరుమీద ఈ నగరం 1480లో స్థాపించబడింది. గురుద్వారా మంజీ సాహిబ్, గురు నానక్ భవన్, ఫిల్లార్ ఫోర్ట్, మహారాజ రంజిత్ సింగ్ యుద్ధ మ్యూజియం, గురు నానక్ స్టేడియం, రాఖ్ బాగ్ పార్కు, మొదలైనవి కొన్ని లుధ్ధియానాలోని పర్యటకంలో ప్రసిద్ధమైనవి.