అజంతా-ఎల్లోరా గుహలు
ఉత్తర మహారాష్ట్ర రాష్ట్రంలోని ఔరంగాబాద్ జిల్లాలో ఈ గుహలు వున్నాయి. హిందూ, బౌద్ధ, జైన మతాలకు సంబంధించిన శిల్పాలు, చిత్రాలు, చెక్కడాలు ఇక్కడ కనిపిస్తాయి. బుద్ధునికి సంబంధించి అజంతాలో 30 వరకు గుహలు ఉన్నాయి. అదేవిధంగా ఎల్లోరాలో 34 గుహలుంటే బౌద్ధ మతానికి 12 గుహలు, హిందూ మతానికి 17 గుహలు, జైన మతానికి సంబంధించి 5 గుహలు ఉన్నాయి.