Augest 31st is the deadline

Augest 31st is the deadline, kamal nath committee, employees bifurcation, ap bifurcation, andhra pradesh, telangana

Augest 31st is the deadline

అందరికి ఆగస్టు 31 డెడ్ లైన్

Posted: 06/20/2014 08:02 AM IST
Augest 31st is the deadline

అందరికి ఆగస్టు 31 డెడ్ లైన్ పెట్టింది కేంద్రం ఎక్కడి వాళ్లు అక్కడికి వెళ్లిపోవాల్సిందే.. చట్టప్రకారం లోకల్‌ ఎవరో, నాన్‌ లోకల్‌ ఎవరో తేల్చేయండి. లోకల్‌ అని చెప్పుకునేవాళ్లలో చాలా మంది దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకున్నారు. రాజధాని ఎక్కడో తేల్చకుండా ఎలా పంపిస్తారు. తెలంగాణ కావాలనుకున్నాం.. ఇప్పుడు ఆంధ్రలో పని చేయమంటున్నారు ఇదెలా? ఇలా ఎన్నో సమస్యలు.. ఎన్నో చిక్కుముడులు.. ఇవన్నీ విప్పడానికే స్వామినాథన్‌ కమిటీ సమావేశమైంది. కాని అదంత తేలిక కాదని అర్ధమైనట్లుంది. అందుకే మరోసారి భేటీ కావాలని డిసైడైంది. ఆగస్టు 31 కి మాత్రం ఏ విషయం తేల్చేయాలని తీర్మానం చేసింది. అప్పుడే ఎవరెటో తేలుతుందని భావిస్తున్నారు.

ఉన్నతాధికారులు హాజరు..!

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులతో కమిటీ సమావేశమయ్యింది. ఇతర రాష్ట్రాల విభజన జరిగినప్పుడు తలెత్తిన సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చించింది. ఆ రాష్ట్రాల్లో ఉద్యోగుల కేటాయింపుల్లో వచ్చిన సమస్యలను ఇక్కడ తలెత్తకుండా చూడాలని కమిటీ అభిప్రాయపడింది. వికలాంగులు, అనారోగ్యంతో బాధపడే వారు, భార్య భర్తలు, ఒకటి రెండు నెలల్లో రిటైర్‌ అవుతున్నవారి విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కమిటీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. జిల్లా, జోనల్‌ పోస్టులను యథాతథంగా ఉంచాలని నిర్ణయించినట్లు సమాచారం. 
తుది పంపిణీ చేయాలి 

ఇది ఇలా ఉంటే కమల్‌నాథన్‌ కమిటీని తెలంగాణ ప్రాంత ఉద్యోగ సంఘాలు కలిశాయి. తాత్కాలిక పంపిణీ జాబితా తప్పుల తడకగా ఉందని కమిటీ దృష్టికి తీసుకెళ్లాయి. స్థానికత ఆధారంగానే ఉద్యోగులు తుది పంపిణీ జరగాలని కోరాయి.

కసరత్తులు చేస్తున్న కమిటీ..!

రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల కేటాయింపు తాత్కాలిక ప్రాతిపదికన జరిగింది. కొత్త ప్రభుత్వాలు కొలువు దీరిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల సర్కార్లకు సేవలందించేందుకు ఉద్యోగులను తాత్కాలికంగా పంపిణీ చేశారు. ఆర్డర్‌ టు వర్క్ నోటీసులతో ఉద్యోగులు పనిచేస్తున్నారు. పంపకాల్లో కొంతమంది రాష్ట్రాలు మారాల్సి వచ్చింది. తెలంగాణ వారు ఆంధప్రదేశ్‌కు, ఏపీ చెందిన వారు తెలంగాణకు వెళ్లారు. దీనిపై అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. అది తాత్కాలికంగా జరిగిన పంపిణీయే అని సర్దిచెప్పారు. ఇప్పుడు ఉద్యోగుల పంపిణీపై తుది మార్గదర్శకాలను విడుదలచేయాల్సి ఉంది. దీనిపై కమల్‌నాథన్‌ కమిటీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. సచివాలయంలో కమిటీ భేటీ అయ్యింది.

ఆగస్టు 31 డెడ్ లైన్...!

ఈ సమావేశంలో తుది మార్గదర్శకాలపై క్లారిటీ వస్తుందని భావించారు. ఐతే కమిటీ 27న మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. జులై ఒకటి కల్లా మార్గదర్శకాలను తయారుచేసి మొదటి వారంలో ఉద్యోగుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తుంది. అనంతరం ఫైనల్‌ మార్గదర్శకాలను ఖరారు చేస్తుంది. వాటి ఆధారంగా ఉద్యోగులు తుది పంపిణీ జరుగుతుంది. ఉద్యోగుల పంపిణీకి ఆగస్ట్‌ 31ని డెడ్‌లైన్‌ విధించారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more