Sun networks ceo kalanidhi maran selling spicejet airlines

sun networks news, sun network airlines, spicejet airlines, kalanidhi maran latest news, kalanidhi maran spice jet

sun networks ceo kalanidhi maran selling spicejet airlines : The sun network ceo kalanidhi maran is looking to sell his spicejet airlines because of 1000 crores loss in just one year

ఆస్తులు అమ్ముకుంటున్న సన్ నెట్ వర్క్స్!

Posted: 08/08/2014 04:47 PM IST
Sun networks ceo kalanidhi maran selling spicejet airlines

యావత్తు దక్షిణా భారతదేశంలో వున్న మీడియా సంస్థల్లో సన్ నెట్ వర్క్స్ ఎంతో బాగా అభివృద్ధి చెందింది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ వంటి తదితర భాషల్లో లెక్కలేనన్ని ఛానెళ్లను మెయింటెయిన్ చేస్తున్న సన్ నెట్ వర్క్ కు టీఆర్ పీ రేటింగ్ విషయంలో ఇంతవరకు తిరుగులేదు. ఒక్కమాటలో చెప్పాలంటే.. దక్షిణాదిన వున్న టెలివిజన్ పరిశ్రమను మొత్తం ఈ సన్ నెట్ వర్కే శాసిస్తోందని చెపప్పుకోవడంలో ఎటువంటి అనుమానం లేదు. మారన్ ల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ ద్వారా వారు వందలకోట్లమేరకు లాభాలను తమ వెనకేసుకున్నారు. దీంతోవారు ఈ మీడియా సంస్థతోపాటు విమానయాన రంగంలో కూడా అడుగులు వేశారు.

ఈ విధంగా ఇన్నాళ్లవరకు లాభాలబాటలో నడిచిన ఈ సన్ నెట్ వర్క్ సంస్థకు ఇప్పుడు కష్టాలు వెంటబడుతున్నట్లు సమాచారం! ప్రస్తుతం ఈ సంస్థకు యజమానిగా వ్యవహరిస్తున్న కళానిధిమారన్.. దేశంలో ఎక్కువ జీతం తీసుకునే సీఈవోల్లో ఈయన ఒకడు. టీవీ ఛానెళ్ల ద్వారా బాగానే డబ్బులు జమ చేసుకున్నా... విమానయానరంగంలో అడుగులు వేసి తప్పు చేసినట్టు కనిపిస్తోంది. మీడియా సంస్థలాగే విమానయాన రంగంలో దూసుకోవాలనే ఆశాభావంతో కళానిధి మారన్ స్పైస్ జెట్ ను కొనుగోలు చేశారు. మొదట్లో అంతా బాగానే నడిచింది కానీ.. రానురాను అందులో భారీనష్టాలు ఏర్పడటం మొదలయ్యాయి.

కష్టాలు ఎన్ని వచ్చినా.. వాటిని భరించుకుంటూ దాదాపు ఒక సంవత్సరకాలంపాటు నెగ్గుకుంటూ వచ్చారు. అయితే లాభాలు వస్తాయని భావించి ఏడాదికాలం వరకు నెగ్గుకుంటూ వస్తే.. ఏకంగా వెయ్యికోట్ల మేర నష్టాలను మూటగట్టుకుందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ నష్టాలను భరించలేక కళానిధిమారన్ ఈ స్పైస్ జెట్ విమానసంస్థను వదిలించుకోవాలని భావిస్తున్నారట! ఇందులో భాగంగానే వారు మెజారిటీ వాటాను అమ్మేయాలని అనుకుంటున్నట్టు తమిళనాడులో వార్తలు జోరందుకుంటున్నాయి. మరి ఈ వెయ్యి కోట్ల నష్ట భారాన్ని తమ నెత్తిమీదకు వేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారట!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • 10 lakh acres land bank in ap

    ఎపి లో 10 లక్షల ఎకరాల భూమి బ్యాంకా..

    Mar 03 | వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో సుమారు లక్ష ఎకరాల మేర వివిధ సెజ్ లు తదితర అవసరాల పేరిట భూమి సేకరిస్తేనే పెద్ద గందరగోళం, విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఏకంగా పది లక్షల ఎకరాల భూమి... Read more

  • Malala satyarthi peace symbols america senate

    వారిద్దరూ శాంతి ప్రతీకలు..., దేశ ముద్దుబిడ్డలు

    Dec 19 | నోబెల్ అవార్డు గ్రహీతలు కైలాష్ సత్యార్థి, మలాలాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా సెనెట్ వీరిద్దర్నీ శాంతి ప్రతీకలంటూ ప్రశంసించింది. ఈ మేరకు సెనేట్ రెజల్యూషన్ పాస్ చేసింది. భారత్ కు చెందిన... Read more

  • Hyderabad drunk and drive cases punishments

    మందుబాబులూ జాగ్రత్త ! ఎంత తాగితే అంత శిక్ష వేస్తున్నారు !

    Dec 19 | ప్రభుత్వానికి టాక్స్ చెల్లించేవారమని సినిమాల్లో గొప్పగా చెప్పుకునే మందుబాబులకు ఈ తీర్పు షాక్ ఇవ్వనుంది. వార్త వింటే కిక్కు దిగి జైలు ఊచలు లెక్కపెట్టవచ్చు. ఎంత పనికి అంతే వేతనం అన్నట్లుగా.., ఎంత తాగితే... Read more

  • Musharraf alleges india behind peshawar attacks

    పెషావర్ పాశవిక దాడికి కుట్ర చేసింది భారతేనట !

    Dec 18 | పాక్ మాజి సైనిక అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ గారు భారత్ పై అక్కసును మరోసారి వెళ్ళగక్కారు. ప్రపంచ దేశాలన్నిటిని విషాదంలోకి నెట్టిన పెషావర్ ఘటనకు భారత్ కారణమని నిందిస్తున్నాడు. మిగతా దేశాలన్ని భారత్ అందిస్తున్న... Read more

  • Kcr house water supply programme medak district divide

    కేసీఆర్ కొత్త అవతారం.. మళ్ళీ విభజనకు శ్రీకారం

    Dec 18 | తెలంగాణ మ్క్షుఖ్యమంత్రి కేసీఆర్ కొత్త అవతారం ఎత్తుతారట. రాష్ర్టంలో ప్రారంభించే ప్రభుత్వ పధకాలు విజయవంతం అయ్యేందుకు దేవుడి అవతారం ఎత్తక తప్పదంటున్నారు. ప్రతి ఇంటికీ నీటి కనెక్షన్ ఇవ్వాలనే ప్రయత్నం విజయవంతం అయ్యేందుకు నరసింహ... Read more